జాతీయ వార్తలు

సిద్ధూ వైఖరి పార్టీకి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీఘ్ఢ్, మే 19: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేబినెట్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోంది. సిద్ధూ వైఖరి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అమరీందర్ సింగ్ తాజాగా ధ్వజమెత్తారు. చివరి విడత పోలింగ్‌కు ముందు ఆయన వ్యవహరించిన తీరు ఏమాత్రం సరైంది కాదని అమరీందర్ అభిప్రాయపడ్డారు. బటిండా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అమరీందర్ సింగ్ రాజాపై వచ్చిన ఆరోపణలపై ఇంతవరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని సిద్ధూ ఇటీవల ఒక సభలో ప్రశ్నించారు. తాను కేబినెట్ మంత్రిగా ఉంటూనే పంజాబ్ సర్కారుపై విమర్శలు గుప్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ సిద్ధూ వాదన తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. అమరీందర్ సింగ్ రాజా విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం సిద్ధూకు లేదని సీఎం స్పష్టం చేశారు.