అంతర్జాతీయం

కలిసి పనిచేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారీస్, మే 25: భారత్‌తో భద్రతాపరమైన అంశాలపై కలిసి పని చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ అన్నారు. రెండోసారి భారత్ ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీని అభినందించిన ఆయన ఇరు దేశాల భద్రతను పటిష్టం చేయడంతో పాటు అంతర్జాతీయ సుస్థిరతకు, సుస్థిరత అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎమ్మాన్యుయల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను ఆయన అభివర్ణించారు. భారత్‌లోని 542 లోక్‌సభ స్థానాల్లో 303 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా నిలబడడానికి ప్రధాని మోదీ కృషి అద్వీతీయం, అపూర్వమని ఆయన ప్రశంసించారు. యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి యూరప్ ప్రజల తరఫున భారత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏకూ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరు దేశాలు పని చేయాలని 2015 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం చేసుకున్నాయి.