అంతర్జాతీయం

సిక్కు మతం ఏం చెప్తోందో తెలుసుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 25: ఎవరు ఏ మతానికి చెందినా ఆ మతం చెప్పేది మానవత్వమే. మత విద్వేషాన్ని ఏ మతం ప్రోత్సహించదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మతంపై ద్వేషంతో ఓ అమెరికన్ చేసిన హేయమైన నేరానికి అక్కడి కోర్టు విలక్షణ తీర్పునిచ్చింది. ఆ నేరస్థుడికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు సదరు మతం ఏం చెపుతోందో తెలుసుకుని కోర్టుకు నివేదిక ఇవ్వాలని, ఇది కూడా శిక్షలో భాగమేనని న్యాయమూర్తి తీర్పులో పేర్కొనడం విశేషం. వివరాల్లోకి వెళితే... పాతికేళ్ల ఆండ్రూ రామ్సే అనే తెల్లజాతీయుడు సిక్కు మతస్తుడు నిర్వహించే ఓ స్టోర్‌లోకి ఈ ఏడాది జనవరిలో ప్రవేశించి అతనిపై దాడి చేశాడు. సిగరెట్లకు ఉపయోగించే రోల్ పేపర్లు కావాలని ఆండ్రూ అడిగాడు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అవి అమ్మడం నేరం. కానీ ఆండ్రూ దగ్గర అవేవీ లేవు. అమ్మడం కుదరదని చెప్పడంతో సిక్కులంటే తీవ్ర వ్యతిరేకత కలిగిన ఆండ్రూ స్టోర్ యజమాని హర్విందర్‌సింగ్ డోడ్ గడ్డాన్ని గుంజడంతో పాటు మొహంపై పిడిగుద్దులు గుద్దాడు. తలపాగాను తీసిపారేశాడు. ఇలాంటి దాడులు ఓరెగాన్ చట్టప్రకారం నేరం. హర్విందర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణ జరిపిన మారియన్ కౌంటీ జడ్జి లిండ్సే పార్ట్రిడ్జ్ విలక్షణ తీర్పు నిచ్చారు. 36 నెలల జైలుశిక్షతో పాటు సిక్కు మతం గురించి, మత విశ్వాసాల గురించి అవగాహన చేసుకుని ఏం నేర్చుకున్నావో కోర్టుకు నివేదించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రతి వారం స్థానిక గురుద్వారాకు వెళ్లి బోధనలు విని అవగాహన పెంచుకోవాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ విషయాన్ని అమెరికాలోని సిక్కు మతస్తులకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఇలాంటి తీర్పుల వల్ల అన్ని మతాలకు చెందినవారిని గౌరవించాలనే భావన కలుగుతుందని, మత విద్వేషాలకు ఎక్కడా తావుండదని ఆ సంస్థ పేర్కొంది.