అంతర్జాతీయం

జూన్‌లో జీ-20 శిఖరాగ్ర సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్‌లో జపాన్‌లో నిర్వహించే జీ-20 శిఖరాగ్ర సదస్సులో భేటీ కానున్నారు. అమెరికా-్భరత్ దేశాల మధ్య వ్యూహాత్మక ఒప్పందాలను మరింత బలపరచుకోవడంతోపాటు గత రెండేళ్లలో ఈ రెండు దేశాలు సాధించిన ప్రగతిని మరింత పటిష్టం చేసే దిశగా ఈ ఇద్దరు నాయకులు ప్రతిజ్ఞ చేయనున్నారు. భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ట్రంప్ మోదీకి ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఇదిలావుండగా, జూన్ 28, 29 తేదీల్లో ఇరు దేశాల నాయకుల మధ్య భేటీ విషయమై శుక్రవారంనాడు ఒక అంగీకారానికి వచ్చారు. జపాన్‌లోని ఒసాకాలో నిర్వహించే జీ-20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా, భారత్‌తో జపాన్ నిర్వహించే త్రిసభ్య సమావేశంలో ఇండో-అమెరికన్ పసిఫిక్ అంశాలపై స్వేచ్ఛగా ముందుకు సాగేందుకు వీలుగా ఇరు దేశాల నేతలు తమ తమ అభిప్రాయాలను పరస్పరం అందిపుచ్చుకోనున్నారు. అమెరికా, భారత దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల్లో సహకారం అందిపుచ్చుకోవడంతోపాటు చారిత్రాత్మక అణుఒప్పందంతోపాటు వాణిజ్యపరంగా, రక్షణపరంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇరు దేశాలు జీ-20 భేటీలో అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలావుండగా, భారత్‌లో అఖండ విజయాన్ని సాధించిన తనను అభినందించిన అమెరికా వైస్‌ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం మరింత పెంచుకునే దిశగా తాము ముందుకు సాగుతామని మోదీ భరోసా ఇచ్చారు.