అంతర్జాతీయం

ఉగ్రవాదం, మతతత్వ శక్తులకు మద్దతివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 26: ఉగ్రవాదానికి, మతతత్వశక్తులకు మద్దతు పలకవద్దని శ్రీలంక ప్రజలకు ఆ దేశ ప్రధాన మంత్రి రనిల్ విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు. దేశంలో ఐసిస్ ఉగ్రవాదం అణచివేతకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకొంటామని చెప్పారు. పౌర సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరోసారి దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అసలు ఉగ్రవాద మూలాలు అనేవి దేశంలో ఎక్కడా లేకుండా చేయడమే ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మూడు హోటళ్లు, మూడు చర్చిల్లో ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అవసరమైన భద్రతా చర్యలు తీసుకొంటోందని చెప్పారు. దాడులను తామే చేశామంటూ నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్‌టీజే) పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ.. ముస్లిం వర్గాల నుంచి అవసరమైన మార్పులు, సలహాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద దాడుల అనంతరం ప్రభుత్వం తీసుకొన్న చర్యలు వివరించాలని ట్రేడ్ యూనియన్లు, పౌర సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు పార్లమెంటరీ స్టేట్ కమిటీని ఎర్పాటు చేసినట్లు ప్రధాని రనిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. ఐసిస్ ఉగ్రవాదులతో స్థానిక ముస్లింలకు ఎలాంటి సంబంధాలు లేవని పీఎం వివరించారు. ఉగ్రవాదులకు, మతతత్వ శక్తులకు ఎలాంటి మద్దతు ఇవ్వొద్దని ఈ సందర్భంగా విక్రమసింఘే సూచించారు.