అంతర్జాతీయం

భారత్‌కు వాణిజ్య రాయతీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 1: భారత్‌కు అభివృద్ధి చెందుతున్న దేశంగా కల్పిస్తున్న ప్రయోజనాలను అమెరికా ఉపసంహరించుకుంది. భారత్‌కు అభివృద్ధి చెందుతున్న లబ్ధిదారుగా ఇచ్చిన హోదాను జూన్ అయిదో తేదీ నుంచి ఉపసంహరించుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్‌పీ) ప్రోగ్రాం కింద భారత్ పొందుతున్న 5.6 బిలియన్ డాలర్ల వాణిజ్య రాయితీలను ఇప్పుడు కోల్పోనుంది. జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్‌పీ) అనేది అమెరికాలోని అత్యంత పురాతనమయిన, అతి పెద్ద వాణిజ్య ప్రాధాన్యతా కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చెందుతున్న దేశాలుగా హోదాను ఇచ్చిన దేశాల నుంచి వేలాది ఉత్పత్తులను సుంకాలు లేకుండా అమెరికాలోకి అనుమతిస్తూ వస్తున్నారు. తద్వారా ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు. ‘్భరత్ తన మార్కెట్లలోకి న్యాయసమ్మతమయిన, హేతుబద్ధమయిన రీతిలో ప్రవేశించడానికి వీలు కల్పిస్తానని అమెరికాకు హామీ ఇవ్వలేదని నేను నిర్ధారించాను. అందువల్ల భారత్‌కు ఇచ్చిన అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను 2019 జూన్ అయిదో తేదీనుంచి తొలగించడం సముచితమయిన చర్య’ అని ట్రంప్ శుక్రవారం జారీ చేసిన సాధికార ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌కు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇచ్చిన హోదాను తొలగించకూడదని అమెరికాలోని పలువురు ఉన్నత స్థాయి చట్టసభల సభ్యులు చేసిన విజ్ఞప్తిని ట్రంప్ పెడచెవిన పెట్టారు. జీఎస్‌పీ కార్యక్రమం కింద భారత్‌కు ఇచ్చిన అభివృద్ధి చెందిన దేశం హోదాను తొలగించాలని అమెరికా యోచిస్తోందని ట్రంప్ మార్చి నాలుగో తేదీన ప్రకటించారు. 60 రోజుల నోటీసు కాలపరిమితి మే మూడో తేదీన ముగిసింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ భారీ మెజారిటీతో విజయం సాధించి నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల తరువాత గురువారం అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి విలేఖరులతో మాట్లాడుతూ అమెరికన్ కంపెనీలకు సమానావకాశాలు ఉండేలా హమీ పొందేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ట్రంప్ పాలనాయంత్రాంగం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ స్పందిస్తూ, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి అమెరికాతో కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తానని తెలిపింది. ఏ సంబంధాలలోనైనా ప్రత్యేకించి ఆర్థిక సంబంధాలలో ప్రస్తుతం కొనసాగుతున్న సమస్యలు అప్పుడప్పుడు పరిష్కారమవుతాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.