అంతర్జాతీయం

కాల్పుల్లో 11 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 1: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వర్జీనియా బీచ్‌లో గల ఒక ప్రభుత్వ భవన సముదాయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
సంబంధిత అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందినట్టు పోలీస్ చీఫ్ జేమ్స్ కెర్‌వెరా శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. ‘సంఘటన స్థలంలో 11 మంది బాధితుల మృతదేహాలు ఉన్నాయి. గాయపడిన మరో ఆరుగురిని ఏరియా ఆసుపత్రులకు పంపించడం జరిగింది’ అని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందనేది తెలియరాలేదని ఆయన చెప్పారు. దీర్ఘకాలం పాటు పబ్లిక్ యుటిలిటీస్ విభాగంలో పనిచేసిన ఉద్యోగియే ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల తరువాత ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సాయుధ దుండగుడు వర్జీనియా బీచ్ మున్సిపల్ కాంప్లెక్స్‌లోని ఒక భవనంలోకి ప్రవేశించి వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడని కెర్‌వెరా చెప్పారు. గాయపడిన వారిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. అతను బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.
‘వర్జీనియా బీచ్ చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమయిన రోజు’ అని మేయర్ బాబీ డైయర్ విలేఖరులతో అన్నారు. అమెరికాలో ఈ సంవత్సరం జరిగిన మాస్ షూటింగ్‌లలో ఇది 150వది. ఒకే కాల్పుల ఘటనలో నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది చనిపోతే దానిని మాస్ షూటింగ్‌గా నిర్వచించారు.