అంతర్జాతీయం

ఈస్టర్ మృతులకు అధ్యక్షుడే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 2: లంక అధ్యక్షుడు సిరిసేనపై సస్పెండైన పోలీస్ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈస్టర్ వేడుకల్లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 258 మరణించడానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనదే పూర్తి బాధ్యత అని సుప్రీంకోర్టుకు సమర్పించిన 20 పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటలిజెన్స్ ఏజెన్సీలు, ప్రభుత్వ భద్రతా దళాల మధ్య సమాచార పరంగా తీవ్రమైన గ్యాప్ ఉందని ఐజీ పుజిత్ జయసుందర పేర్కొన్నారు. దీనికి అధ్యక్షుడు సిరిసేనే కారణమని సుప్రీంకోర్టుకు గతవారం సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ఆదివారం వెల్లడించింది. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థ అయిన సిస్ (స్టేట్ ఇంటలిజెన్స్ సర్వీస్).. ఇస్లామిక్ మిలిటెంట్‌లపై తమ పోలీస్ వ్యవస్థ చేస్తున్న దర్యాప్తును పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించిందని జయసుందర పేర్కొన్నారు. ఈస్టర్ వేడుకల్లో బాధ్యులుగా పేర్కొంటున్న నేషనల్ తౌహీత్ జమాత్ సహా ఉగ్రవాదులపై తాము జరుపుతున్న దర్యాప్తులను ఆపివేయాల్సిందిగా సిస్ నేరుగా అధ్యక్షుడికి నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. పొరుగు దేశమైన భారత్ సహా ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదికలను సిస్ పట్టించుకోలేదని జయసుందర నివేదికలో చెప్పారు.