అంతర్జాతీయం

ఇఫ్తార్ విందులో అతిథులకు అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 2: ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథులకు ఘోర అవమానం ఎదురైంది. మితిమీరిన భద్రత పేరిట పాకిస్తాన్ సెక్యూరిటీ అధికారులు చేసిన నిర్వాకం వల్ల ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథులు ఇబ్బందులు పడడంతోపాటు మరికొంతమంది మధ్యలోనే వెళ్లిపోయారు. పాకిస్తాన్‌లోని భారత హె కమిషనర్ అజయ్ బిసారియా ఏటా రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమంలో భాగంగా శనివారంనాడు ఇక్కడి సెరెనా హోటల్‌లో ఏర్పాటు చేసిన విందుకు ఉన్నతాధికారులను ఆహ్వానించారు. అయితే, అతిథులు ఎక్కువగా హాజరైన ఈ ఈవెంట్‌లో పాక్ భద్రతా అధికారులు అదనపు సెక్యూరిటీ పేరిట పాల్పడిన చర్యలు చాలా అవమానకరంగా ఉన్నాయి. కొందరు అతిథుల పట్ల భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన పలువురు అతిథులు లోనికి రాకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. ఒక జర్నలిస్టు చెప్పిన వివరాల ప్రకారం.. ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథుల వద్ద ఆహ్వాన పత్రాలు, గుర్తింపు కార్డులు ఉన్నా, అవసరానికి మించి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ‘నా ఆహ్వాన పత్రాన్ని చెక్ చేసినపుడు తన వృత్తి, నివాసం వంటి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే లోనికి వదిలారు’ అని ఆ జర్నలిస్టు తెలిపారు. ఇఫ్తార్ విందులో పోలీసులు, టెర్రిరిజం వ్యతిరేక దళాలు హోటల్‌కు హాజరైన అతిథుల పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఇదే కార్యక్రమానికి హాజరైన మరో జర్నలిస్టు మెహ్‌రీన్ జహ్‌రా మాలిక్ మాత్రం ఇఫ్తార్ విందులో పాక్ భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు సరైనదేనని వ్యాఖ్యానించారు. మరో జర్నలిస్టు పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథుల పట్ల సెక్యూరిటీ చెకింగ్‌ల పేరిట పాల్పడుతున్న చర్యలను చూసి తాను లోనికి వెళ్లలేకపోయానని వ్యాఖ్యానించారు. అదనపు సెక్యూరిటీ పేరిట పాక్ అధికారులు చేపడుతున్న చర్యల గురించి తెలుసుకున్న పలువురు అతిథులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరుకాలేదని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుండగా, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు ఫర్హాతుల్లా బాబర్ మాట్లాడుతూ భారత హైకమిషన్ అధికారులు ఇక్కడి సెరెనా లగ్జరీ హోటల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని అన్నారు. తాను లోనికి వెళ్లేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా భద్రతా సిబ్బంది తీరు పట్ల విసుగు చెందానని, అసలు ఏమి జరుగుతోందన్న మీమాంశ తనకు ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఇఫ్తార్ విందులో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల భారత హైకమిషనర్ బిసారియా అతిధులకు క్షమాపణలు కోరారు. విందుకు హాజరై ఇబ్బందులు పడ్డవారికి, విందుకు రాలేని వారికి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు లాహోర్, కరాచీ నుంచి హాజరైన అతిథులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అవమానం సిగ్గుచేటు : ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: భారత హై కమిషన్ ఇస్లామాబాద్‌లో శనివారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పిలిచిన అతిథులను అవమానించడం శోచనీయమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీనిని ‘దెబ్బకు దెబ్బ ద్వైపాక్షికం’గా ఒమర్ అభివర్ణించారు. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం లేదా ఇస్లామాబాద్‌లోని భారత కార్యాలయంలో ఇలాంటి చర్యలు జరిగితే ‘దెబ్బకు దెబ్బ ద్వైపాక్షిక విధానం’గానే అనాల్సి ఉంటుందని ఒమర్ అన్నారు. ఇలాంటి విధానాలను తక్షణమే ఆపాలని ఒమర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని ఖరీదైన సెరెనా హోటల్‌లో పాకిస్తాన్‌కు చెందిన ముఖ్యమైన ముస్లిం నేతలందరినీ శనివారం ఇఫ్తార్ విందుకు భారత రాయబార కార్యాలయం ఆహ్వానించింది. అతిథులందరినీ పాక్ వర్గాలు తనిఖీలు పేరుతో అవమానపరిచారని, వచ్చిన వారిలో కొంతమంది వెనుదిరిగి వెళ్లిపోయారని ఇదేమి ద్వైపాక్షిక విధానం? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. పెద్ద ఎత్తున పాక్ బలగాలను మోహరించి వచ్చిన అతిథులను తనిఖీల పేరుతో వేధించడం సరైన చర్య కాదని ఒమర్ అన్నారు. దీనిని నిజమైన ప్రతీకార చర్యగా ఒమర్ పేర్కొన్నారు. కాగా, ఇఫ్తార్ విందుకు హాజరైన అతిథులందరికీ పాక్‌లోని భారత రాయబారి బిసారియా కృతజ్ఞతలు తెలియజేశారు.