అంతర్జాతీయం

వంటికి యోగా మంచిదేగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: యోగా సాధనతో కండరాలు మరింత బలపడడంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ విద్యార్థుల అధ్యయనంలో తేలింది. పెద్దవారిలో యోగా సాధనతో జరిగే పరిణామాలపై ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అధ్యయనాల్లో ఈ విషయం తేటతెల్లమైంది. యోగా చేసిన వారికి చేయని వారిలో కలిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో విద్యార్థులు క్షుణ్ణంగా పరిశీలించారు. నెల నుంచి ఏడు నెలలపాటు నిత్యం 30 నుంచి 90 నిమిషాలపాటు యోగా సాధన చేసిన వారు ఏ విధంగా ఉన్నారన్న అంశాన్ని వీరు నిశితంగా పరీక్షించారు. యోగా సాధన చేసిన వారితో పాటు నిత్యం నడక లేదా ఏరోబిక్స్ చేసిన వారిలో కూడా ఆరోగ్యంలో కలిగే మార్పులను వీరు అధ్యయనం చేశారు. తాము జరిపిన అధ్యయనాలను బట్టి యోగా ప్రాక్టీస్ చేసిన వృద్ధులు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేటతెల్లమైందని ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన శివరామకృష్ణన్ పేర్కొన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉందని శివరామకృష్ణన్ స్పష్టం చేశారు. యోగా చేయని వారిలో కన్నా చేసిన వారిలోనే సామర్థ్యం పెంపుదల, కాళ్లలో బలం, సుఖ నిద్ర, మానసిక, శారీరక ఆరోగ్యం తదితర అంశాల్లో మెరుగైన మార్పులు కనిపించాయని అధ్యయనంలో పేర్కొన్నారు.