అంతర్జాతీయం

సౌదీకి ‘అణు సహకారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 5: సౌదీ అరేబియాకు అణు సాంకేతిక సహకారాన్ని అందించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్య తరువాత అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెమోక్రటిక్ సెనేటర్ ఒకరు వెల్లడించారు. 2017 తరువాత అమెరికా తీసుకున్న రెండో కీలక నిర్ణయం ఇది. విదేశీ వ్యవహారాల విభాగం కమిటీ సభ్యుడు టిమ్ కైనే స్పష్టం చేశారు. అమెరికా ఇంధన శాఖ సౌదీకి అణు సాంకేతిక బదిలీ చేయాలని వత్తిడి చేస్తోంది. ప్యానెల్ కమిటీ చైర్మన్ జోక్యంతో ఇది సాకారమైందని ఆయన అన్నారు. గత నెలలో అమెరికా కాంగ్రెస్‌ను కాదని సౌదీకి ఆయుధాల విక్రయించాలని ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యెమన్‌లో తిరుగుబాటు దారులపై జరుగుతున్న యుద్ధంలో సౌదీ భాగస్వామ్యం ఉన్నందునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.