అంతర్జాతీయం

అంబేద్కర్‌కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 9: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్‌కు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. ఆయన జయంతి కార్యక్రమాన్ని తొలిసారి ఐక్యరాజ్య సమితిలో నిర్వహించనున్నారు. సమాజంలో అసమానతలను రూపుమాపడం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంపై దృష్టి సారిస్తూ కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ హారిజాన్ సహకారంతో ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత రాయబార కార్యాలయం అంబేద్కర్ 125వ జయంతికి ముందు రోజే ఈ నెల 13వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్ ‘ట్విట్టర్’లో వెల్లడించారు.