అంతర్జాతీయం

షాంఘై శిఖరాగ్రంలో కలవనున్న మోదీ-జిన్‌పింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 9: షాంఘై శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీజిపింగ్ చేతులు కలపబోతున్నారు. ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్‌సీవో) సమ్మిట్ నిర్వహించనున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కంగ్ ప్రకటించారు. చైనా అధ్వర్యంలో జరిగే ఈ సమ్మిట్‌లో ఆర్థిక, భద్రతా అంశాలపై చర్చ ఉంటుందన్నారు. 2017 సంవత్సరంలో ఎస్‌సీవో గ్రూపులో భారత్, పాక్‌లకూ సభ్యత్వం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ రెండో పర్యాయం భారత్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారని, ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీజిపింగ్‌ను కలుసుకోనున్నారని ఆయన వివరించారు. ఎస్‌సీవో సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిపింగ్ కలిసి చర్చలు జరుపుతారని చైనాలోని భారత రాయబారి విక్రం మిస్రి గత వారం తెలిపారు. గత ఏడాది ఉవాన్‌లో మోదీ-జిపింగ్ చేసుకున్న దైపాక్షిక ఒప్పందం ఫలితాలు ఇచ్చాయని వివరించారు.
ఉవాన్ చర్చల తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్‌లో అర్జెంటినియాలో జరిగిన జి-20 సమ్మిట్ సందర్భంగా కూడా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిపింగ్‌తో చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు.

మోదీ-జిన్‌పింగ్ (ఫైల్‌ఫొటో )