అంతర్జాతీయం

తీవ్రవాదానికి ఆశ్రయం కల్పించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 9: మతతత్వ నేతలు, రాజకీయ నాయకుల వైఖరి వల్లే ఈరోజు దేశం విచ్ఛిన్నమైందని శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ధ్వజమెత్తారు. దేశ విచ్ఛిన్నానికి ప్రధాన కారకుడైన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) లేదా తమిళ్ టైగర్స్ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ నాయకుడు వేలుపిళ్లయి ప్రభాకరన్ వంటివారు మళ్లీ పుట్టేందుకు ఎలాంటి ఆస్కారం కల్పించవద్దని అంటూ తీవ్రవాదానికి ఆశ్రయం కల్పించవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు స్వతంత్రంగా నిలబడిన తమిళ రాష్ట్రాన్ని వేలుపిళ్లయి నేతృత్వంలోని ఎల్‌టీటీఈ తూర్పు శ్రీలంక, ఉత్తర శ్రీలంకగా విడదీసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్‌టీటీఈ మితిమీరిన జోక్యంతో శ్రీలంకలో 2009లో జరిగిన అల్లర్లలో ప్రభాకరన్ నాయకత్వంలోని ఆర్మీ 10 వేల మంది ప్రజలను బలితీసుకున్న విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన గుర్తు చేశారు. ఇలా ముక్కలు చెక్కలుగా విభజించేందుకు ప్రయత్నించడం వల్ల మొత్తం దేశం ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన అభిప్రాయపడుతూ ‘మరో యుద్ధం వచ్చే అవకాశం ఉంది’ అంటూ హెచ్చరించారు.
ఇదిలావుండగా, ఈస్టర్ సండే సందర్భంగా దేశంలోని మూడు కేథలిక్ చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లపై ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ సహకారంతో స్థానిక ఇస్లామిక్ గ్రూప్ దాడులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, దేశంలోని ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు ఇపుడు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపైనే దృష్టి సారించారు తప్ప దేశ భద్రత కోసం కాదని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని దేశంలోని తమిళ ప్రజలంతా గమనించి పరిస్థితులకు అనుగుణంగా మెలగాల్సిన అవసరం ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో దేశ విచ్ఛిన్నానికి దారితీసిన పరిస్థితులను పక్కనపెట్టి, ఇపుడు దేశమంతా ఐక్యమత్యంగా ముందుకు సాగేందుకు ప్రజలు ముందుకు రావాలని, ఇదే సందర్భంలో తీవ్రవాదానికి ఎలాంటి మద్దతు పలకవద్దని శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ప్రజలను కోరారు.