అంతర్జాతీయం

ప్రతిష్ట పెంచిన ప్రవాసీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 9: విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు గత ఐదేళ్ళుగా తమ శక్తి, కృషితో దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు విస్తరింపజేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం మాల్దీవుల్లో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌తో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా ఆదివారం శ్రీ లంకకు చేరుకున్నారు. శ్రీ లంక అధ్యక్షుడు, ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ వెళ్ళారు. ఇలాఉండగా కొలంబోలో ఏర్పాటైన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ విదేశాల్లో ఉన్న భారతీయుల కృషి, సహకారం వల్ల ఆయా దేశాలు ప్రగతిని సాధిస్తున్నాయని, ఫలితంగా భారత్‌కూ మంచి పేరు వస్తున్నదని అన్నారు.
దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ భారతీయులు ఉన్నారని, భారతీయుల కష్టపడి పని చేస్తారన్న ప్రశంసే తప్ప ఏ ఒక్క చిన్న ఫిర్యాదు కూడా రాదన్న ధీమాను మోదీ వ్యక్తం చేశారు. తాము అధికారం చేపట్టిన ఈ ఐదేళ్ళలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని, రానున్న రోజుల్లో ఇంకా సాధిస్తుందని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు పాలన కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన వివరించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి అధికారాన్ని అప్పగించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, లోక్‌సభకు ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎంపికయ్యారని ప్రధాని మోదీ వివరించారు.