అంతర్జాతీయం

పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 10: నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని సోమవారం పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ కేసులో తనకు తన సోదరి ఫర్యాల్ తల్పూర్‌లు అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ పొడిగించాలన్న జర్దారీ పిటీషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసుల సహాయంతో జాతీయ అకౌంటబిలిటీ బృందం ఎఫ్-8 సెక్టార్‌లోని జర్దారీ ఇంట్లోకి ప్రవేశించి ఆయన్ను అరెస్టు చేసింది. అయితే ఆయన సోదరిని ఇంత వరకు అరెస్టు చేయలేదు. పలువురు మహిళా పోలీసు అధికారులు కూడా వెళ్ళారు. బ్యాంకులో నకిలీ అకౌంట్లు కలిగి ఉండడమే కాకుండా అందులోని సొమ్మును పాకిస్థాన్ వెలుపలకు బదిలీ చేస్తున్న ఆరోపణలను జర్దారీ ఎదుర్కొంటున్నారు.