అంతర్జాతీయం

‘గే’ పెరేడ్‌లో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 10: ‘గే పెరేడ్’లో తొక్కిసలాటకు కారణమైన 38 ఏళ్ల అమెరికన్ భారతీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తన వద్ద ఉన్న బీబీ తుపాకీని బయటకు తీసి చంపుతానని బెదిరించి అందరినీ ఆందోళనకు గురిచేసిన కారణంగా అఫ్తబ్జిత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. వేలాది మంది హాజరైన ‘గే’ల పెరేడ్‌లో ఒక్కసారిగా సింగ్ తనవద్దనున్న బీబీ గన్ (బొమ్మ తుపాకీ)ని బయటకు తీసి గాలిలోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా పెరేడ్‌లో ఆందోళన మొదలైంది. ఇమిటేషన్ గన్ అయినప్పటికీ వేలాది మంది పాల్గొన్న గేల పెరేడ్‌లో అలజడి కారణంగా సింగ్‌ను అరెస్టు చేసినట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో తొమ్మిది మందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.