అంతర్జాతీయం

ఆస్తుల వెల్లడికి డెడ్‌లైన్ జూన్30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 10: దేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ గండం నుంచి గట్టెక్కేందుకు వీలుగా పన్నుల మినహాయింపు పథకం కింద మినహాయింపు పొందేందుకు తమ తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని రుణ భారం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని ఆదాయ వనరుల కోసం సరికొత్త పంథాను అనుసరించారు. 2019-20 ఫెడరల్ బడ్జెట్‌ను మంగళవారంనాడు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని సోమవారంనాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘దేశం గొప్పగా ఎదగాలని మనం భావిస్తే అందుకు తగినవిధంగా మనకు మనమే మారాలి. ఆస్తుల వెల్లడి పథకాన్ని తీసుకువస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పన్నులు చెల్లించకుంటే దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లలేం’ అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అక్రమ సొమ్మును ప్రభుత్వానికి అప్పగించే వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆయన భరోసా ఇచ్చారు. పన్నుల మినహాయింపు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజలకు ఈనెల 30వరకు గడువు ఇస్తున్నామని, ఆలోగా తమ తమ బినామీ ఆస్తులు, బినామీ బ్యాంకు అకౌంట్లు, విదేశాల్లో దాచి ఉంచిన నగదు వంటి సమగ్ర వివరాలను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘జూన్ 30 వరకు విధించిన గడువు తర్వాత ఇలాంటి అవకాశాన్ని మళ్లీ పొందలేరు’ అని పేర్కొంటూ ఈలోగా ఆస్తుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఎవరెవరికి బినామీ ఆస్తులు ఉన్నాయో, ఎవరెవరికి బినామీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో వంటి సమగ్ర వివరాలన్నీ మా ఏజన్సీల వద్ద ఉన్నాయి’ అని ప్రధాని ప్రజలను పరోక్షంగా హెచ్చరించారు. ‘ఇలాంటి పథకం ఎప్పుడూ రాబోదు. వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూర్చండి. పిల్లల భవిష్యత్తుకో దోహదపడండి. దేశం నుంచి పేదరికాన్ని తరిమేందుకు, తద్వారా దేశం స్వంత కాళ్లపై నిలబడేందుకు ముందుకు రండి’ అని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘గత పదేళ్ల కాలంలో పాక్ పౌరులపై 6,000 బిలియన్ల నుండి 30,000 బిలియన్ల రుణభారం పెరిగింది’ అని ఆయన పేర్కొన్నారు. ఏటా వసూలవుతున్న పన్నులు కేవలం 4,000 బిలియన్లు ఉండడం, వాటిలో సగం రుణ భారం కింద చెల్లిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు.