అంతర్జాతీయం

లంక ముస్లింలపై వేధింపులు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 10: శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ముస్లిం మైనారిటీల ప్రమేయాన్ని ఖండిస్తూ తమిళ నాయకుడు అంతర్జాతీయ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈస్టర్ పర్వదినం రోజు జరిగిన దాడుల్లో ముస్లిం మైనారిటీలను బాధ్యులను చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందే వస్తుందని తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంత మాజీ ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ ఆరోపించారు. ఆదివారం ఆయన జాఫ్నాలో విలేఖరులతో మాట్లాడుతూ ఈస్టర్ రోజు జరిగిన దాడుల నేపథ్యంలో తమిళ జనాభాలో తొమ్మిది శాతం మంది ఉన్న ముస్లింలు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న ముస్లిం రాజకీయ నేతలు కూడా ఉగ్రవాదానికి మద్దతుగా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ‘శ్రీలంక జనాభాలో ముస్లింలు ఒక భాగం.. దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వీరు వ్యవహరిస్తున్నారని అనడం తీవ్ర అన్యాయం’ అన్నారు. నిషేధిత నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థతో అనేక మంది ముస్లింలకు లింక్‌లు ఉన్నాయని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయడం శోచనీయమని చెప్పారు. దేశంలో ముస్లింలకు రక్షణలో కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ కేబినెట్‌లోని మంత్రులు గత వారం రాజీనామా చేశారనీ అంటూ విఘ్నేశ్వరన్ వారికి సానుభూతి వ్యక్తం చేశారు. నిషేధిత ఎన్టీజేతో లింక్‌లు ఉన్న వారిపై దర్యాప్తు నిర్వహించాలని రాజీనామా చేసిన మంత్రులు డిమాండ్ చేశారు. 225 మంది పార్లమెంట్ సభ్యుల్లో 19మంది ముస్లిం నేతలు ఉన్నారు. ఇందులో రాజీనామా చేసిన తొమ్మిది మందిలో కేబినెట్ మంత్రులుగా, సహాయ మంత్రులుగా పనిచేస్తున్నారు. రాజీనామా చేసిన మంత్రులపై వస్తున్న ఆరోపణలను రుజువు చేయాలనీ.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని విఘ్నేశ్వరన్ డిమాండ్ చేశారు.