అంతర్జాతీయం

ఈస్టర్ పేలుళ్ళపై లంక అధ్యక్షుడికి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 10: శ్రీ లంకలో వరుస బాంబు పేలుళ్ళ ఘటనలపై ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు త్రిసభ్య సంఘం సోమవారం నివేదిక సమర్పించింది. ఏప్రిల్ 22న ఈస్టర్ సండే సందర్భంలో ప్రధాన చర్చిల్లో, స్టార్ హోటళ్ళలో తొమ్మిది వరుస బాంబు పేలుళ్ళు జరగడంతో శ్రీ లంక అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ళ ఘటనల్లో 258 మృత్యువాత పడగా, 500 మందికి పైగా గాయపడ్డారు. దీంతో లంక దేశాధ్యక్షుడు సిరిసేన ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. సుప్రీం కోర్టు జస్టిస్ విజిత్ మలాల్‌గోడ నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పద్మశ్రీ జయమన్న, మాజీ పోలీసు చీఫ్ ఎన్‌కే ఎలాంగకూన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ జరిగిన ఘటనలపై క్షుణ్ణంగా ఆరా తీసింది. ఎక్కడ లోపం జరిగింది?, ఎవరి వైఫల్యం?, నిఘా సంస్థలు ఎంత వరకు అప్రమత్తం చేశాయి?, పోలీసులు, సైన్యం అప్రమత్తతతో వ్యవహరించలేదా? వంటి అనేకానేక కోణాలపై అధ్యయనం చేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ విజిత్ మలాల్‌గోడ నేతృత్వంలోని ఈ కమిటీ సభ్యులు రాష్టప్రతిని కలిసి నివేదిక సమర్పించారు. ఈ ఘటనలపై ఇప్పటి వరకు 106 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అధ్యక్షుడు సిరిసేన ఇదివరకే పోలీసు చీఫ్ జయసుందరపై అనుమానంతో డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.