అంతర్జాతీయం

అదొక్కటే కారణం కాదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జూన్ 13: ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ను అధిరోహకుల మరణాలపై నేపాల్ ప్రభుత్వం స్పందించింది. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న అధిరోహకుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్గ మధ్యంలో రద్దీవల్లే అధిరోహకులు చనిపోతున్నారన్న వార్తలను నేపాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మరణాలకు అదొక్కటే కారణం కాదని, ఆరోగ్య సమస్యలు, ప్రతికూల వాతావరణం వల్ల మృత్యువాత పడుతున్నారని నేపాల్ సర్కార్ స్పష్టం చేసింది. ఎవరెస్ట్ పర్వతారోహకుల మరణాలపై అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాదే అత్యధిక మరణాలు సంభవించాయని వెల్లడించారు. 11 మంది పర్వతారోహకులు మృతి చెందినట్టు మీడియాలో వచ్చిన వార్తలను నేపాల్ ప్రభుత్వం తోసిపుచ్చింది. తొమ్మిది మంది మాత్రమే చనిపోయారని నేపాల్ పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది. 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ ఎక్కుతూ చనిపోయిన తొమ్మిది మందిలో నలుగురు భారతీయులున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వౌంట్ కంచెనగంగా, వౌంట్ మెకాలులో ఇద్దరేసిన చొప్పున చనిపోయినట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఎనిమిది మంది భారతీయులు మృతి చెందినట్టు చెప్పారు. వౌంట్ ఎవరెస్ట్‌కు సంబంధించి దేశీయ, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలపై టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ దండు రాజ్ జిగ్మైర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్వతారోహకుల రద్దీ వల్లే మరణాలు చోటుచేసుకుంటున్నాయన్న వార్తలను ఆయన ఖండించారు. అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఎంతమాత్రం లేదని, మరణాలు సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయని హిమాలయన్ టైమ్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఎత్తునకు వెళ్లడం వల్ల వత్తిడి పెరగడం, నీరసం/ ప్రతికూల వాతావరణంతోనే పర్వతారోహకులు చనిపోతున్నట్టు పోస్టుమార్టం నివేదికల్లో తెలుపుతున్నాయని జిగ్మైర్ స్పష్టం చేశారు. మీడియా వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని నేపాల్ పర్యాటక శాఖ విజ్ఞప్తి చేసింది. మీడియా ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు పర్వతారోహణ ఆసక్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది. 1922 నుంచి ఇప్పటి వరకూ ఎవరెస్ట్ శిఖరంపై 200 మంది అధిరోహకులు మృతి చెందారు. అప్పటి నుంచి పరిశీలిస్తే ఇటీవలే అక్కడ చనిపోయిన వారు ఎక్కువ. చనిపోయిన వారి మృతదేహాలు లభించని సంఘటనలూ ఉన్నాయి. మంచులో కూరుకుపోయి సమాధి అయిపోతున్నారు. 2018లో వౌంట్ ఎవరెస్టుపై ఐదుగురు మృతి చెందారు. 2016లో ఆరుగురు, 2017లో ఏడుగురు మరణించారు. మంచుచరియిలు విరిగిపడి ఇరవై మంది పర్వతారోహకులు చనిపోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి సీజన్‌లో అంటే మార్చి నుంచి జూన్ నెలాఖరు వరకూ నేపాల్ వైపునుంచి వందలాది మంది ఎవరెస్ట్‌ను అధిరోహిస్తుంటారు. ఎడ్మండ్ హిల్లరీ, టెంజింగ్ నార్గే ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి పర్వతారోహకులు. వారి తరువాత అంటే 1953 నుంచి 4,400 మంది ఎవరెస్ట్‌ను అధిరోహించినట్టు నేపాల్ టూరిజం శాఖ వెల్లడించింది.