అంతర్జాతీయం

శాంతి, సౌభాగ్యాల కోసం ‘సహకారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్కేక్, జూన్ 14: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లోని సభ్య దేశాలు ఉగ్రవాదంపై యుద్ధం, ఆర్థికాభివృద్ధి, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆరోగ్య సంరక్షణ అంశాలలో సహకారాన్ని బాగా పెంపొందించుకోవాలని భారత ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఈ రీజియన్‌లో శాంతి, ఆర్థిక సుసంపన్నతకు భారత్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకారం పటిష్టత కోసం ‘హెల్త్’ అనే టెంప్లేట్‌ను ఇచ్చారు. ‘మన మధ్య ఆరోగ్యవంతమయిన సహకారాన్ని బలోపేతం చేసుకోవడం అనేది మన స్వప్నం. హెల్త్ అనే ఇంగ్లీషు పదంలోని అక్షరాలను ఉపయోగించుకొని, మనం సహకారం కోసం ఒక మంచి టెంప్లేట్‌ను తయారు చేసుకోగలం. హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ)లో సహకారం కోసం హెచ్, ఎకనమిక్ (ఆర్థిక) సహకారం కోసం ఈ, ఆల్టర్‌నేట్ ఎనర్జీ (ప్రత్యామ్నాయ ఇంధనం) కోసం ఏ, లిటరేచర్ అండ్ కల్చర్ (సాహిత్యం, సాంస్కృతిక) కోసం ఎల్, టెర్రరిజం ఫ్రీ సొసైటీ (ఉగ్రవాదం లేని సమాజం) కోసం టీ, హ్యుమానిటేరియన్ కోఆపరేషన్ (మానవతావాద సహకారం) కోసం హెచ్ అక్షరాన్ని ఉపయోగించుకోవాలి’ అని మోదీ సూచించారు. ఎస్‌సీఓ ప్రాంతంతో భారతదేశ చరిత్ర, నాగరికత, సంస్కృతికి వేలాది సంవత్సరాలుగా అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఆధునిక యుగంలో మెరుగయిన అనుసంధానత అవసరం ఎంతయినా ఉంది. ఇది మనందరికీ అవసరం’ అని మోదీ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, చబహర్ పోర్ట్, ఆష్గాబాట్ ఒప్పందం వంటి వాటిని ప్రస్తావిస్తూ భారత్ అనుసంధానతపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తోందని ఆయన వివరించారు. ‘సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, సుపరిపాలన, పారదర్శకత, వాస్తవికతలను గౌరవించాలి. అనుసంధానత కోసం తీసుకునే చొరవపై ఆధారపడి విశ్వసనీయత ఉండాలి. భౌతిక అనుసంధానతతో కూడిన ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాల ప్రాముఖ్యత తక్కువేమీ కాదు’ అని మోదీ అన్నారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) కింద చైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మీదుగా భారీగా చేపట్టిన వౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 60 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టు పీఓకే మీదుగా వెళ్తున్నందున, దానిని భారత్ వ్యతిరేకిస్తోంది. ఎస్‌సీఓ కార్యకలాపాలన్నింటి పట్ల భారత్ సానుకూలంగా స్పందిస్తోందని మోదీ తెలిపారు.