అంతర్జాతీయం

ఒకే తాటిపైకి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్కెక్, జూన్ 14: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్న దేశాలకు జవాబుదారీ తనం ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమ్మిట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలు ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఎస్‌సీఓ సమ్మిట్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సహా పలుదేశాల అధినేతలు హాజరయ్యారు. ఇమ్రాన్ సమక్షంలోనే ఉగ్రవాదంపై మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎస్‌సీఓ స్ఫూర్తితో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్న మోదీ దాన్ని మరింత బలోపేతం చేసుకుందానని స్పష్టం చేశారు. భారత్‌ను ఉగ్రవాద రహిత దేశంగా తయారు చేయడానికి అనేక కఠిన చర్యలు చేపట్టినట్టు ప్రధాని పేర్కొన్నారు.‘గత ఆదివారం శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఉగ్రవాదులు తెగబడిన సెయింట్ ఆంథోనీ చర్చ్‌ను సందర్శించాను. అమాయకులు ప్రాణాలు బలిగొన్న ఉగ్రమూకల వికృత చేష్టలను ప్రార్థనామందిరం సాక్షిగా నిలిచింది. ఆటవిక చర్యలను సమాజం గర్హించాలి’అని మోదీ పిలుపునిచ్చారు. ఈస్టర్ రోజు ఉగ్రవాదులు జరిపిన దాడిలో 258 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంకుచిత ధోరణిని విడనాడి మానవాళికి పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. షాంఘై సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హాజరయ్యారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలకు జవాబుదారీ తనం ఉండాలని మోదీ నొక్కిచెప్పారు. ఉగ్రవాదంపై చర్చించేందుకు ఓ అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయాలని ఎస్‌సీఓ నేతలకు ప్రధాని సూచించారు. సంస్కృతి, సాహిత్యం సమాజ పురోభివృద్ధికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. తీవ్రవాదం వల్ల సమాజానికి చేటు జరుగుతుందని, దాన్ని నిరోధించేందుకు సభ్యదేశాలు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ‘ఆఫ్గనిస్తాన్‌లో శాంతి, ఐకమత్యం, భద్రత, ప్రజాశ్రేయస్సుకు ఎస్‌సీఓ దేశాలు కంకణబద్ధులై ఉండాలి. దేశంలో సుస్థిరత, భద్రత కల్పించేందుకు మనందరం పనిచేద్దాం’అని భారత ప్రధాని స్పష్టం చేశారు. ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వానికి బాసటగా నిలవడమే ఎస్‌సీఓ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లోనే ఆఫ్గనిస్తాన్ కోసం రోడ్‌మ్యాప్ రూపొందించాలని నిర్ణయించడం సంతోషదాయకమని మోదీ చెప్పారు. ఎస్‌సీఓలో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం వచ్చి రెండేళ్లవుతోందని, సంస్థ చేపట్టే అన్ని కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నామని ప్రధాని వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కిర్కిజ్ రాజధానికి గురువారం చేరుకున్నారు. షాంఘై కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ రెండు రోజుల పాటు జరగనుంది. చైనా నేతృత్వంలోని ఎస్‌సీఓలో ఎనిమిది దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ భూభాగం ఉగ్రవాదులకు భూతల స్వర్గంగా ఉందని, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఉపసంహరించుకోవాలని గతంలోనే భారత్ హెచ్చరించింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు, పాక్ ప్రేరిత ఉగ్రవాదులు చర్యలు శృతిమించాయి. 2016 జనవరిలో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి తరువాత పాక్‌తోఅన్ని సంబంధాలూ నిలిపివేశారు. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులే పఠాన్‌కోట్‌లో దాడికి పాల్పడినట్టు భారత్ తిరుగులేని ఆధారాలు చూపించింది. తరువాత జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు తెగబడి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
పుల్వామా దాడికి ప్రతికారంగా పీఓకేలోని బాలాకోట్ జైషే స్థావరంపై భారత్ వైమానిక దాడులు జరిపింది. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై లక్షిత దాడులు జరగ్గా మర్నాడు ఎంఐజీ-21 యుద్ధవిమానాన్ని పాక్ దించేసింది. ఐఏఎఫ్ పైలెట్‌ను పట్టు దళాలు పట్టుకున్నాయి. తరువాత పైలెట్‌ను భారత్‌కు అప్పగించింది. ఇలా ఉండగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తొలగించడంతో చైనా కీలక భూమిక పోషించింది.