అంతర్జాతీయం

అట్టుడుకిన హాంకాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్ మళ్లీ నిరసనలతో అట్టుడుకింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఓ ప్రతికూల బిల్లుకు వ్యతిరేకంగా లక్షలాదిగా ప్రజలు ఆదివారం ప్రదర్శన జరిపారు. ఈ బిల్లు వల్ల చైనాతో హాంకాంగ్ సంబంధాలు దెబ్బతింటాయన్న ఆందోళన ప్రజల్లో తీవ్ర స్థాయికి చేరుకుంది.
*
హాంకాంగ్, జూన్ 16: హాంకాంగ్‌లో నేరస్థుల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు. సెంట్రల్ హాంకాంగ్ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. హాంకాంగ్‌లో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి. కొత్తగా తెచ్చిన నేరస్థుల అప్పగింత చట్టాన్ని రద్దు చేయాలని, హాంకాంగ్ నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రదర్శకులు పెద్దపెట్టున నినదించారు. నేరస్థుల అప్పగింత బిల్లుపై గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో క్యారీ లామ్ శనివారం విధులకు దూరంగా ఉన్నారు. ప్రజల మనోభావాలను తాను అంచనా వేయలేకపోయానని ఆమె పేర్కొన్నారు. వేలాది మంది ప్రదర్శకులు నగర పార్లమెంటు వైపు సాగారు. వారం రోజుల క్రితం నిర్వహించిన ప్రదర్శనలో పది లక్షల మంది పాల్గొన్నారని, ఆదివారం నాటి ప్రదర్శనలో అంతకన్నా ఎక్కువ మంది పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. చైనా మద్దతుతో తెస్తున్న ఈ నేరస్థుల అప్పగింత చట్టం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, సురక్షితమయిన వ్యాపార కేంద్రంగా హాంకాంగ్ నగరానికి ఉన్న ప్రతిష్టను దెబ్బతీస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. చైనాకు అనుకూలంగా పనిచేస్తున్న లామ్ ఈ చట్టాన్ని అమలు చేయడాన్ని నిలిపివేస్తానని శనివారం హామీ ఇచ్చారు. అయితే, ప్రదర్శకులు మాత్రం ఈ హామీని తిరస్కరించారు. లామ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, బిల్లు మొత్తాన్ని రద్దు చేయాలని, ఈ వారం మొదట్లో ప్రదర్శకులపై పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించినందుకు క్షమాపణ చెప్పాలని ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న నాయకులు డిమాండ్ చేశారు.
హాంకాంగ్‌లో రెండోసారి లక్షల సంఖ్యలో ప్రజలు ఆదివారం వీధికెక్కిన నేపథ్యంలో బీజింగ్ అనుకూల నాయకత్వం కొంత దారికొచ్చినట్లు కనిపిస్తోంది. నేరస్థుల అప్పగింత చట్టంపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనలు, అలాగే, సంఘర్షణలకు కారణమైనందుకు తాను క్షమాపణ చెబుతున్నానని కేరీలాం ప్రకటించారు. అయతే, పదవి నుంచి తప్పుకోవడానికి మాత్రం నిరాకరించారు. ఈ వివాదాస్పద చట్టంపై ప్రజల నుంచి విమర్శలను స్వీకరిస్తూ అందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్షమాపణ చెబుతునానరని లాం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయతే, తన పాలనా యంత్రాంగం తీసుకొన్న అసంబద్ధ చర్యల కారణంగానే ఈ అనూహ్య పరిస్థితి తలెత్తిందని లాం స్పష్టం చేశారు.