అంతర్జాతీయం

షేక్‌హ్యాండూ అపురూపమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: భారత్-పాక్ సంబంధాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాలు సార్క్ హోం మంత్రుల స్థాయి సమావేశాల్లో సైతం బయటపడ్డాయ. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ముఖాముఖి ఎదురుబడినప్పుడు ఎడమొఖం పెడమొఖంగా కనిపించారు. సమావేశం జరుగుతున్న సెరేనా హోటల్ వద్దకు రాజ్‌నాథ్ చేరుకున్నప్పుడు చౌదరి గేట్ వద్ద ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో కరచాలనం కూడా చేసుకోకుండా కేవలం ఒకరి చేతులను మరొకరు తాకడంతో సరిపెట్టుకున్నారు. న్యూఢిల్లీనుంచి వచ్చిన మీడియా ప్రతినిధులను పాక్ అధికారులు దూరంగా ఉంచడం కారణంగా ఈ క్షణాలను తమ కెమెరాల్లో వారు బంధించలేక పోయారు.