అంతర్జాతీయం

ఇక జన‘ భారత’మే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 17: మరో 8 ఏళ్ళలో భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారబోతోంది.
2027 నాటికి భారత జనాభా చైనాను దాటి పోతుందని, 2019-2050 నాటికి అదనంగా దాదాపు 273 మిలియన్ల మేర భారత జనాభా పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రస్తుత శతాబ్దం అంతా భారతే అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతుందని, దీనికి పోటీ వచ్చే దేశం మరొకటి ఉండదని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే రానున్న 30 ఏళ్ళలో ప్రపంచ జనాభా కూడా మరో 200 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 7.7 బిలియన్ల మేర ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 9.2 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా స్థాయి 1100 కోట్లకు పెరగవచ్చునని కూడా ఈ నివేదిక తెలిపింది. 2050 నాటికి పెరిగే ప్రపంచ జనాభా అంతా దాదాపుగా 9 దేశాల్లోనే కేంద్రీకృతమవుతుందని, అత్యధిక పెరుగుదల భారత్‌లోనేనని తెలిపింది. తదుపరి స్థానాల్లో నైజిరియా, పాకిస్థాన్, ఇండోనేషియా, ఈజిప్టు తదితర దేశాలు ఉంటాయని ఈ నివేదిక వివరించింది. ప్రస్తుతం 1.4 బిలియన్ల మంది జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా మొదటి స్థానంలో, 1.37 బిలియన్ల మందితో భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.