అంతర్జాతీయం

మైత్రికి మరింత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, జూన్ 17: యూఎస్-భారత్ మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల ప్రస్తుతం అమల్లో ఉన్న పలు కీలకాంశాలు రానున్న రోజుల్లోనూ కొనసాగనున్నాయని భారత్‌లో అమెరికా సీనియర్ రాయబారి కెనె్నత్ జస్టెర్ తెలిపారు. ఉభయ దేశాల మధ్య రక్షణ, టెర్రరిజం, వాణిజ్యం, శక్తి (ఇంధనం) తదితర విభాగాల్లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, సహకారం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా అవి అలాగే కొనసాగాలని తాము అభిలషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్ తమ దేశంతో వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తోందని, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి సైతం ఇండో-పసిఫిక్ రీజియన్‌ను ‘ప్రముఖ శక్తి’గా అభివర్ణించడంతోపాటు ‘సహజ మిత్రులు’ అని పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా వ్యాపారరంగంలో భారత్ ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా శక్తివంతంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ‘యూఎస్- భారత్ సంబంధాలు ఇపుడు చాలా విశాలం, సంక్లిష్టం, ప్రపంచంలోని ఏ దేశంతోనైనా చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల్లోకెల్లా గొప్పవి. అంతర్జాతీయపరంగా ఎదురైన ఎన్నో అంశాలను చక్కదిద్దేందుకు కలుపుకునే తత్వంతో వ్యవహరిస్తోంది’ అని భారత్‌లో అమెరికా రాయబారి కెనె్నత్ జస్టెర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రారంభమైన ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ గ్రేటర్ హోస్టన్ (ఐఏసీసీజీహెచ్) 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. టెక్సాస్ 3.6 బిలియన్ డాలర్ల విలువ గల వస్తువులను భారత్ నుంచి దిగుమతి చేసుకుందని, అదేవిధంగా భారత్ 5.1 బిలియన్ డాలర్ల వస్తుసామాగ్రిని అమెరికాకు ఎగుమతి చేసిందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికా నుంచి 15 శాతానికి పైగా వస్తుసామాగ్రిని భారత్‌కు దిగుమతి చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికా-్భరత్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వల్ల 140 బిలియన్ డాలర్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత్‌కు చెందిన పలు కంపెనీలు అమెరికా, టెక్సాస్‌లలో తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఉదాహరణకు..జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 500 మిలియన్ డాలర్ల నిధులను బేటౌన్‌లో తాము చేపట్టిన స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావడమే. అదేవిధంగా విప్రో, ఇన్ఫోసిస్ వంటి టెక్ దిగ్గజాలు సైతం టెక్సాస్‌లో టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం, మహీంద్ర సంస్థ హోస్టన్‌లోని ప్రధాన కేంద్రంలో తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈవిధంగా పలువురు భారతీయ పెట్టుబడిదారులు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మా దేశ వినియోగదారుల మేలు కోసం నాణ్యతగల వస్తువులను ఉత్పత్తి చేయడం, తద్వారా అమెరికా ఆర్థిక ప్రగతికి దోహపడున్నారు’ అని భారత్‌లో అమెరికా రాయబారి కెనె్నత్ జస్టెర్ పేర్కొన్నారు. ఈవిధంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార, రక్షణ, టెర్రరిజం వంటి కీలక అంశాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలబించడం వల్ల బంధం మరింత బలపడుతుందని, భవిష్యత్తులో సైతం ఈ బంధం మరింత దృఢంగా మారగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.