అంతర్జాతీయం

అణ్వాయుధాలు 13,865

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, జూన్ 17: న్యూక్లియర్ యుద్ధాలకు సన్నద్ధం అనే యుద్ధ అధిపతులు తగ్గారు కానీ, వివిధ దేశాలు మాత్రం తమ ఆయుధశాలలను బ్రహ్మండంగా ఆధునీకరించుకుంటున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా దేశాలు 13,865 న్యూక్లియర్ ఆయుధాలు సమకూర్చుకున్నాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) స్పష్టం చేసింది. అయితే గత ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఈ ఆయుధాల తయారీ 600 తక్కువగా ఉంది. అయితే న్యూక్లియర్ ఆయుధాల తయారీ తగ్గినప్పటికీ భారత్, చైనా, పాకిస్థాన్ దేశాలు తమ ఆయుధ భాంఢాగారాలను విస్తరిస్తున్నాయి. న్యూక్లియర్ ఆయుధాల తయారీ తగ్గినా ఆధునీకరణ పద్ధతుల్లో తయారీ చేసుకుంటున్నట్లు స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఐపీఆర్‌ఐ) డైరెక్టర్ షణ్ణూన్ కైల్ తెలిపారు. న్యూక్లియర్ ఆయుధా లు భారీగా తగ్గాయి. 1980 సంవత్సరంలో సుమా రు 70 వేల న్యూక్లియర్ ఆయుధాలు ఉండేవి. భారత్-పాక్‌ల మధ్య సాంప్రదాయ సంఘర్షణ ఉండడం, న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉం డడం పట్ల ఎస్‌ఐపీఆర్‌ఐ డైరెక్టర్ కైల్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యూక్లియర్ ఆయుధాల తయారీని అమెరికా విస్తరిస్తున్నదని అన్నారు. ఐక్యరాజ్య సమితి మాజీ చీఫ్ బ్యాన్‌కీ-మూన్ న్యూక్లియర్ ఆయుధాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచానికే ఇవి ప్రమాదమని హెచ్చరించారు.