అంతర్జాతీయం

చైనాను వణికించిన రెండు భూకంపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: ఒకదాని వెంట మరొకటిగా విరుచుకుపడిన రెండు భూకంపాలు చైనాను వణింకించాయి. నైరుతి ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ప్రకృతి విలయంలో కనీసం 12 మంది మృతి చెందారని, దాదాపు 125 మంది క్షతగాత్రులయ్యారని మంగళవారం నాడిక్కడ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 10.55 నిమిషాలకు 6.0 మాగ్నిట్యూడ్ల తీవ్రతతో చేంజింగ్ కంట్రీ ప్రాంతంలోని ఇబిన్ నగరంలో సంబవించిందని చైనా భూకంప కేంద్రం (సీఈఎన్‌సీ) తెలిపింది. అదే ప్రాంతాన్ని మంగళవారం ఉదయం మరోమారు 5.3 మాగ్నిట్యూడ్ల తీవ్రతతో వచ్చిన భూకంపం అతలాకుతలం చేసింది. సోమవారం సంభవించిన భూకంపం భూమి లోపల 16 కిలోమీటర్ల లోతునుంచి సంభవించింది. ఇళ్లు ధ్వంసమైన కారణంగానే అధిక శాతం మరణాలు చోటుచేసుకున్నాయని భద్రతా దళాలు తెలిపాయి. సుమారు 53 మంది క్షతగాత్రులు చేజింగ్ కంట్రీలోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇందులో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, మరో ఆరుగురు సైతం తీవ్రంగా గాయపడ్డారు. చైనా మీడియా కథనం మేరకు తొలి భూకంపం సంభవించబోయే ముందు కేవలం ఒక్క నిమిషం ముందే అధికారులు చెంగ్డూ, ఇబిన్ ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ప్రజలను అప్రమత్త చేశారని తెలుస్తోంది. కాగా ఇద్దరు వ్యక్తులు మట్టికింద కూరుకుపోగా ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నలుగురు వ్యక్తులను రక్షంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ప్రభుత్వ అధీనంలోని న్యూస్ ఏజెన్సీ ‘గ్జిన్‌హువా’ తెలిపింది. ఈ భూకంప విలయంతో ఇబిన్ ప్రజలు పెద్దయెత్తున షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో అత్యవసర నిర్వహణ, ప్రావిన్షియల్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెంటనే అప్రమత్తమైంది. జాతీయ ఆహార, పరిపాలనా వ్యూహ రిజర్వుల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి భూకంప ప్రాంతంలో నిరాశ్రయుల కోసం 5000 టెంట్లు, 10వేల ఫోల్డింగ్ బెడ్లు, మరో 20 వేల ఆహార పొట్లాలు సరఫరా చేశాయి. 302 అగ్నిమాపక యంత్రాలను, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.