అంతర్జాతీయం

పడవ బోల్తా: 17 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూన్ 18: ఇండోనేషియాలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 17 మంది మరణించారు. ఆచూకి లభించని మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పడవలో నిర్ణీత సంఖ్యకు మించి ఎక్కువ మంది ఉండడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు పోలీసులు చెప్పారు. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఈ దుర్ఘటన జరిగింది. రమదాన్ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు పడవలో షికారుకు బయలుదేరారు. నిజానికి పడవలో 30 మంది మించి సామర్థ్యం లేకపోయినా 60 మంది వరకు ఎక్కి ఉంటారని పోలీసులు తెలిపారు. పడవ బయలుదేరిన కొద్ది సేపటికి బోల్తా పడింది. దీంతో ఆ పరిసరాల్లో ఉన్న మత్స్స కార్మికులు హటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని 39 మందిని కాపాడారు. అయినప్పటికీ 17 మంది నీట మునిగి మరణించారు.
వీరిలో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా నలుగురి ఆచూకి లేకపోవడంతో మత్స్సకారులు, పోలీసులు, గజ ఈతగాళ్ళు ప్రయత్నిస్తున్నారు.