అంతర్జాతీయం

చంద్రశేఖర్‌ది ఆత్మహత్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 18: అమెరికాలోని లోవా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ సుంకర (44), అతని కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతిపై చిక్కుముడి కొంత వరకు వీడింది. ఐటీ ప్రొఫెషనల్ అయిన చంద్రశేఖర్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని భార్య, ఇద్దరు కుమారులు హత్యకు గురయ్యారని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సోమవారం పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ ఇంట్లోనే అతనితో పాటు అతని భార్య లావణ్య సుంకర (41), కుమారులు ప్రభాస్ సుంకర (14), సుహాస్ సుంకర (11) తూటాలు తగిలిన గాయాలతో మృతిచెంది ఉండటాన్ని పోలీసులు శనివారం ఉదయం కనుగొన్నారు. ఈ నలుగురి మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చంద్రశేఖర్ సుంకర తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, అతని భార్య, ఇద్దరు కుమారులు హత్యకు గురయ్యారని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వెస్ట్ డెస్ మోయిన్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్ధారణకు వచ్చింది. అయితే, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ముగ్గురిని ఎవరు హత్య చేశారనే విషయంపై పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. అయితే, ఈ హత్యల దరిమిలా ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు పేర్కొన్నారు. ‘లావణ్య, ఆమె కుమారులు మృతి చెందిన తీరును బట్టి చూస్తే, ఆ ముగ్గురు హత్యకు గురయ్యారు. చంద్రశేఖర్ మృతి చెందిన తీరును బట్టి చూస్తే, అతను తనను తాను కాల్చుకొని మృతి చెందాడు’ అని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘తుపాకి తూటాల గాయాల వల్లే ఈ నలుగురు మృతి చెందినట్టు స్టేట్ మెడికల్ ఎగ్జామినర్స్ కార్యాలయం నిర్ధారించింది’ అని పోలీసులు తెలిపారు. ఆ కుటుంబంలో బ్రతికి ఉన్న వారి నుంచి వివరాలు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రశేఖర్‌కు ఆయుధాన్ని వెంట ఉంచుకోవడానికి ఏప్రిల్‌లో పర్మిట్ ఇచ్చినట్టు డల్లాస్ కంట్రీ షెరిఫ్ చాద్ లియొనార్డ్ సోమవారం తెలిపారు. అనుమతి లభించిన తరువాత చంద్రశేఖర్ ఒక ఆయుధం కొనుగోలు చేసినట్టు పోలీసులు చెప్పారు.

చంద్రశేఖర్ సుంకర కుటుంబం (ఫైల్)