అంతర్జాతీయం

ఎవరెస్టు అధిరోహణలో కొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, జూన్ 18: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని రికార్డు స్థాయిలో 885 మంది ఈ సీజన్‌లో అధిరోహించారు. మంగళవారం వెలువడిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే, ఎవరెస్టును అధిరోహించే సాహసానికి చాలా మంది దిగడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. అలాగే, ఎవరెస్టు పర్వతంపై ఈ సీజన్‌లో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. గత సంవత్సరం అప్పటి వరకు ఉన్న రికార్డులను అధిగమించి 807 మంది ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ సంవత్సరం 885 మంది ఎవరెస్టును అధిరోహించడంతో గత సంవత్సర రికార్డు బద్దలయింది. నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న ఎవరెస్టును దక్షిణం వైపు నుంచి 644 మంది అధిరోహించారు. ఈ వైపు నుంచి గత సంవత్సరం కన్నా 81 మంది ఎక్కువగా ఈ సంవత్సరం ఎవరెస్టును ఎక్కారని అధికారులు మంగళవారం తెలిపారు. టిబెట్‌లోని ఉత్తరం వైపు నుంచి మరో 241 మంది ఎవరెస్టును అధిరోహించారని చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా వెల్లడించింది. ఇటు వైపు నుంచి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ముగ్గురు ఎక్కువ ఎక్కారు.