అంతర్జాతీయం

అమెరికా వ్యూహాలకు చైనా, రష్యా గండి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూన్ 19: ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నదని ఆరోపిస్తూ ఉత్తర కొరియాను ఏకాకిని చేసే అమెరికా ప్రయత్నానికి రష్యా, చైనా గండికొడుతున్నాయి. ఉత్తర కొరియాకు ఇంధన సరఫరాను నిలిపివేయాల్సిందిగా ప్రపంచ దేశాలకు అమెరికా పిలుపునిచ్చింది. తన ప్రతిపాదనను అంగీకరించకపోతే ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు ఆయా దేశాలే బాధ్యత వహించాలంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అమెరికాను దాదాపుగా ప్రతి విషయంలోనూ వ్యతిరేకిస్తూ వస్తున్న చైనా, రష్యా ఇపుడు ఒకటయ్యాయి. ఉత్తర కొరియాకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉత్తర కొరియా క్షిపణుల తయారీ, అణు పరీక్షలను ఐక్యరాజ్యసమితి తప్పు పట్టింది. భద్రతా మండలి ఈ విషయంపై స్పందిస్తూ ఉత్తర కొరియాకు ఇంధన సరఫరాను నిలిపివేయాలని ప్రతిపాదించింది. అమెరికా దీనిని అమలు చేస్తూ ప్రపంచ దేశాలను కూడా తమ బాటలో నడవాలని పిలుపునిచ్చింది. మారణాయుధాల తయారీని ఉత్తర కొరియా మానుకోనంతకాలం ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా తేల్చిచెప్పింది. వివిధ దేశాల నుంచి ఉత్తర కొరియాకు ఏటా 5 లక్షల బ్యారళ్ల ముడిచమురు దిగుమతికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. అంతకంటే ఒక్క బ్యారల్ కూడా అదనంగా చేరడానికి వీల్లేదని ఆదేశించింది. అయితే, ప్రస్తుతం ఈ సీలింగ్ కంటే ఎక్కువ మొత్తంలో ముడిచమురును ఉత్తర కొరియా దిగుమతి చేసుకుంటోంది. అందుకే 5 లక్షల బ్యారళ్ల సీలింగ్‌ను అమలుపరిచేలా తమ తమ ఎగుమతులను సగానికి సగం తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలను అమెరికా కోరింది. అయితే, చైనా, రష్యా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. ఉత్తర కొరియాకు అవసరమైన ముడిచమురు సరఫరా చేయడానికి ఈ రెండు దేశాలు ముందుకొచ్చాయి. అమెరికా ఆదేశాలు లేదా ప్రతిపాదనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూ కాంగ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రష్యా సైతం ఆంక్షలను వ్యతిరేకిస్తున్నదని ఆయన చెప్పారు.