అంతర్జాతీయం

ఎమెన్ అంతర్యుద్ధంలో 90 వేలకు పైగా మృతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, జూన్ 19: ఎమెన్‌లో చాలాకాలంగా జరుగుతున్న అంతర్యుద్ధంలో 90వేలకు పైగా పౌరులు మృతి చెందారని అధికారులు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ మద్దతుతో దేశంలోనే తిరుగుబాటుదారులు 2014లో అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఎమెన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. రాజధాని సనాతోపాటు దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లో అలజడి సృష్టించింది. సౌదీ అరేబియా మద్దతుతో జరిగిన దాడుల్లో ఎన్నో పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. తిరుగుబాటుదారుల పాలనకు వ్యతిరేకంగా మొదలైన నిరసన ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సౌదీ అరేబియా ఎడతెరపి లేకుండా వైమానిక దాడులను జరుపుతోంది. ఈ దాడుల్లో కొన్ని ఆసుపత్రులు కూడా ధ్వంసమయ్యాయి. ఫలితంగా వేలాదిమంది సామాన్యులు మృతి చెందారు. 2015 సంవత్సరంలో 17,100 మంది పౌరులు చనిపోయినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో అత్యధికంగా 30,800 మంది పౌరులు మరణించారని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. మొత్తమీద సుమారు నాలుగేళ్ల కాలంలో 91,600 మంది మృత్యువాత పడ్డారు. సౌదీ అరేబియా, ఇరాన్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఎమెన్ పరిస్థితిని వేదికగా మార్చుకున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తిరుగుబాటుదారుల పాలనకు ఇరాన్ మద్దతు ఇస్తుంటే, ఈ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా పోరాడుతున్న ఎమెన్ బృందాలకు సౌదీ అరేబియా మద్దతుగా నిలుస్తోంది. ఇరు వర్గాల దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతోన్న ఎమెన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.