అంతర్జాతీయం

కిమ్ జోంగ్‌తో జిన్‌పింగ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యోంగ్యాంగ్, జూన్ 20: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గురువారం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు ప్యోంగ్యాంగ్‌లో జిన్‌పింగ్‌కు కిమ్ జోంగ్ ఉన్ ఘన స్వాగతం పలికారు. ఈ ఇద్దరు నేతలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చైనా, ఉత్తర కొరియా మధ్య వ్యాకుల పరిచే రీతిలో ఉన్న సంబంధాలను మెరుగుపరచడానికి జిన్‌పింగ్ ఈ చరిత్రాత్మక పర్యటనకు పూనుకున్నారు. గత 14 ఏళ్లలో ఉత్తర కొరియాను సందర్శించిన తొలి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కావడం విశేషం. ఉత్తర కొరియా రెచ్చగొట్టే రీతిలో అణ్వస్త్ర కార్యక్రమాలకు పూనుకోవడం, ప్రతిగా ఆ దేశంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) విధించిన ఆంక్షలకు చైనా మద్దతివ్వడం వంటి పరిణామాలతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మిత్రదేశాలయిన ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. అయితే, గత సంవత్సరం ఉత్తర కొరియా చైనాతో దౌత్యసంబంధాలను గణనీయంగా మెరుగుపరచుకోవడానికి కృషి చేసింది. ఈ క్రమంలో జి జిన్‌పింగ్, కిమ్ జోంగ్ ఉన్ నాలుగుసార్లు భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు తీవ్ర స్థాయిలో తలెత్తిన నేపథ్యంలో జిన్‌పింగ్ వచ్చే వారం జపాన్‌లో జరుగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్న తరుణంలో చైనా పలుకుబడిని పెంచుకోవడానికే జిన్‌పింగ్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారని కొంత మంది విశే్లషకులు పేర్కొన్నారు. ‘చైనా, ఉత్తర కొరియా రెండూ కూడా అమెరికా నుంచి ఘర్షణను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల ఈ రెండు దేశాలు పరస్పరం చర్చించుకోవలసినవి చాలా ఉన్నాయి’ అని పాకిస్తాన్‌లోని మిషన్ ఆఫ్ చైనా ఎంబసీ డిప్యూటి చీఫ్ లిజియాన్ ఝావో సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్, విదేశాంగ మంత్రి వాంగ్ యి, ఇతర అధికారులతో కలిసి రెండు రోజుల ఉత్తర కొరియా పర్యటన ప్రారంభించారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయంలో గురువారం వారికి కిమ్ జోంగ్ ఉన్ ఘన స్వాగతం పలికారని చైనా అధికార మీడియా తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది.
చిత్రం...కిమ్ జోంగ్‌తో జిన్‌పింగ్ (కుడి)