అంతర్జాతీయం

ఉగ్రవాదులతో చర్చలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూలై 20: ఆఫ్గానిస్తాన్‌పై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి భారత్ తేల్చిచెప్పింది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రతినిధులతో అమెరికా త్వరలోనే కతార్ వేదికగా చర్చలు జరపనుంది. అఫ్గాన్‌లో ఇస్లామిక్ పాలన కొనసాగించిన తాలిబన్లు ఆ తరువాత అమెరికా దాడుల కారణంగానే అధికారాన్ని కోల్పోయారు. అయితే, తిరిగి వారితోనే అమెరికా చర్చలు జరపడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితికి భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరొద్దీన్ స్పష్టం చేశారు. అనేకానేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్వర్గ్ధామంగా విరాజిల్లుతోందని ధ్వజమెత్తారు. ఏమైనా నిర్ణయాలు తీసుకొనేటప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నంత కాలం ఆఫ్గాన్‌లో శాంతి ప్రక్రియ సాధ్యం కాదని ఆయన అన్నారు. తాలిబన్లతో అమెరికా చర్చల వల్ల ఫలితం ఉండదని తెలిపారు. అల్‌ఖైదా, తాలిబన్, హకానీ, డయేష్ తదితర ఉగ్రవాద సంస్థలను ఏరివేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రత్యక్షంగానే ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తోందనీ, ఈ పరిస్థితుల్లో శాంతి స్థాపన సాధ్యం కాదని అక్బరొద్దీన్ అన్నారు. ముందుగా ఉగ్రవాద సంస్థలను ఏరివేయాలని, ఆ తరువాతే శాంతి చర్చలు జరపాలని అమెరికాకు హితవు పలికారు.