అంతర్జాతీయం

ఆ ప్రాణాంతక వ్యాధికి కారణాలివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 20: శాస్తజ్ఞ్రులు జీన్ ఎడిటింగ్ టూల్ సీఆర్‌ఐఎస్‌పీఆర్/సీఏఎస్9ను ఉపయోగించి అప్పుడే పుట్టిన శిశువుల్లో ప్రాణాంతకమయిన శ్వాససంబంధమయిన వ్యాధికి గల కారణాలను, దానికి శక్తివంతమయిన చికిత్సను కనుగొన్నారు. ఈ వ్యాధి వల్ల శిశువుల పెదవులు, చర్మం నీలి రంగులోకి మారుతుంటాయి. ఈ రుగ్మతను అల్‌వెయొలార్ కాపిల్లరి డిస్‌ప్లాసియా విత్ మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ పల్‌మనరి వెయిన్స్ (ఏసీడీఎంపీవీ) అని పిలుస్తారు. అమెరికాలోని సిన్సినాటి చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఈ రుగ్మతకు కారణాలను కనుక్కోవడంతో పాటు నానోపార్టికల్-ఆధారిత చికిత్సను అభివృద్ధి చేశారు. ఏసీడీఎంపీవీ రుగ్మత సాధారణంగా నెలలోపు వయసు గల శిశువులకు వస్తుంది. బిడ్డ తల్లి కడుపులో ఉన్న సమయంలో అవయవాలు ఏర్పడే దశలో ఊపిరితిత్తులకు సంబంధించిన కేశనాళికలు (అల్‌వెయొలార్ కాపిల్లరీస్) అనే చిన్న రక్తనాళాలు సరిగా తయారుకాకపోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల కణజాలానికి ప్రాణవాయువు కొరత ఏర్పడుతుంది. వాపు లేదా నొప్పితో కూడిన వాపు ఏర్పడుతుంది. ఇది శిశువు ప్రాణం పోవడానికి కూడా దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు. ‘ఊపిరితిత్తుల మార్పిడి మినహా ఈ వ్యాధికి ఇప్పటి వరకు శక్తివంతమయిన చికిత్స లేదు. అందువల్ల దీనికి వైద్య చికిత్సను కనుగొనడం అత్యవసరం’ అని సిన్సినాటి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని వ్లాడ్ కలినిచెంకో పేర్కొన్నారు. ‘ఈ రుగ్మత ఉన్న శిశువుల్లో శ్వాసకోశ కేశనాళికల (అల్‌వెయొలార్ కాపిల్లరీస్) సంఖ్యను పెంచడానికి, తద్వారా శ్వాసకోశ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి మేము ఒక నానోపార్టికల్ వైద్య చికిత్సను కొనుగొన్నాం’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కలినిచెంకో తెలిపారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరి అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.