అంతర్జాతీయం

అంతటా యోగ ముద్రే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్/లండన్, జూన్ 21: యావత్ ప్రపంచం యోగా ముద్రను సంతరించుకున్నది. చైనాలోని ప్రపంచ ప్రఖ్యాత షావోలిన్ ఆలయం నుంచి బ్రిటన్‌లోని చారిత్రక సెయింట్ పాల్స్ క్యాథడెల్ వరకు లక్షలాది మంది శుక్రవారం యోగా ఆచరించారు. ఎంతో ఉత్సాహంగా ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా చైనా యోగాను ఆచరిస్తున్నప్పటికీ ఈ ఐదేళ్ళ కాలంలో దాని ఖ్యాతి మరింత పెరిగింది. ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా పరిరక్షించుకునే సాధనంగా యోగను గుర్తించిన చైనా ప్రభుత్వం తన క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా దీనిని ఎప్పటికప్పుడు పెంపొదిస్తున్నది. బీజింగ్‌లోని ఇండియా హౌస్‌లో భారత దౌత్య కేంద్ర యోగ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భారత రాయబారి విక్రమ్ మిస్రీ పాల్గొన్నారు. భారత్-చైనాల మధ్య నాగరికతకు సంబంధించిన బంధాన్ని మాత్రమే కాకుండా ఇరు దేశాల ప్రజల్లో ఉన్న ఆధునిక ఆలోచనలకు కూడా యోగా అద్దం పడుతుందని ఈ సందర్భంగా మిస్ర్తి అన్నారు. చైనాలోని అనేక ప్రాంతాల్లో యోగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో యోగాసనాల్లో పాల్గొన్నారని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
బ్రిటన్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో యోగాసనాలు వేశారు. దాదాపు 30 మంది యోగా గురువులు తమ ఆసనాలను అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఇండియా టూరిజం నిర్వహించింది. ఇజ్రాయిల్‌లో 400 మంది యోగసనాలు వేశారు. యోగాను వార్షిక కార్యక్రమాల్లో భాగం చేయాలని ఈ సందర్భంగా భారత రాయబారి పవన్ కుమార్ ఇజ్రాయిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయిల్‌లో యోగా పట్ల ఆసక్తి పెరుగుతున్నదని అన్నారు. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక దేశాల్లోని అనేక చారిత్రక ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.