అంతర్జాతీయం

జర్మన్ మహిళపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూన్ 26: 18 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో మొత్తం 11 మంది నిందితులు ఇక్కడి నైరుతి జర్మనీ కోర్టులో బుధవారం విచారణను ఎదుర్కొనగా ఇందులో అధికులు సిరియాకు చెందినవారే. గత ఏడాది అక్టోబర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సందర్భంగా జర్మనీ వ్యాప్తంగా వలసలపై పెద్దయెత్తున ధుమారం రేగింది. కాగా ఇక్కడి ఫ్రైబర్గ్ స్టేట్ న్యాయస్థానంలో గత డిసెంబర్ నుంచి ఈ కేసు విచారణ సాగుతోంది. స్థానిక వార్తా సంస్థ డీపీఏ కథనం మేరకు నిందితులంతా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులు. ఇందులో ఎనిమిది మంది సిరియా నుంచి వలస వచ్చినవారు కాగా, ఒకరు అల్జీరియాకు, మరొకరు జర్మనీకి చెందిన వ్యక్తి. ఒక డిస్కో సందర్భంగా మహిళ తాగిన పానీయంలో ‘ఎక్స్‌స్టసే’ అనే గుళికను కలపడంతో ఏమి జరుగుతోందో తెలియని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్డడ్డారని ప్రాసిక్యూటర్స్ తెలిపారు. డిస్కో నుంచి వెలుపలికి వచ్చాక తనపై పలువురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.