అంతర్జాతీయం

హక్కుల ఉల్లంఘనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్త, జూన్ 26: ఇండోనేసియా రాజధాని జకార్తలో గత నెలలో జరిగిన పోలీసుల దాడులపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల చర్య మానవ హక్కుల ఉల్లంఘనేనని తక్షణం ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. జొకొ విడొడొ దేశాధ్యక్షుగా తిరిగి ఎన్నికైన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా జరిగిన శాంతి ర్యాలీలు ఉద్రిక్తతంగా మారాయి. ప్రజలతపై పోలీసులు ఏకపక్షంగా విరుచుకుపడ్డారు. సెంట్రల్ జకార్తలో పోలీసులు, నిరసనకారుల మధ్య వీధి పోరాటాలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో కనీసం తొమ్మిది మంది నిరసనకారులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేసియాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. పోలీసులు దాడులకు సంబంధించి వీడియోలో సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేశాయి. పోలీసుల అధికారుల బృందం అదేపనిగా జనంపై విరుచుకుపడే సన్నివేశాలు ఆన్‌లైన్ వీడియోలో అందరూ వీక్షించారు. పోలీసుల దాడులపై అమ్నెస్టీ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం లేఖ రాసింది. జకార్తలో భీతావహ పరిస్థితులు సృష్టించారని, జనాన్ని చిత్రహింసలకు గురిచేశారని సంస్థ ఆరోపించింది. పారామిలటరీ దళాలు పది మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారని అమ్నెస్టీ పేర్కొంది. సంస్థ ఇండోనేసియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఉస్మాన్ హమీద్ ఓ వార్తా సంస్థతోమాట్లాడుతూ దాడులపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై జరిగిన దాడులకు సంబంధించి తమ సొంత సంస్థతో దర్యాప్తు జరిపించినట్టు నేషనల్ పోలీసు అధికార ప్రతినిధి డేడీ ప్రసెట్యో వెల్లడించారు. దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నట్టు మీడియాకు ఆయన తెలిపారు. మృతుల్లో ఓ హైస్కూల్ విద్యార్థి ఉన్నారన్న వార్తలపై ఆయన స్పందించలేదు. వివేదిక వస్తేనే తప్ప వివరాలు వెల్లడించలేమన్నారు. కాగా నిరసనకారులపై తుపాకీలు ప్రయోగించలేదని, రబ్బర్ బుల్లెట్స్, వాటర్ కనెన్స్, భాష్పవాయువుమాత్రమే ప్రయోగించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తుపాకీ గుళ్ల గాయాలతోనే మరణాలు సంభవించాయన్న కథనాలపై అమ్నెస్టీ తీవ్రంగా పరిగణించింది.