అంతర్జాతీయం

తాబేళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 26: తాబేళ్ళను మలేసియాకు అక్రమంగా రవాణా చేసిన ఇద్దరు భారతీయులను, మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన మరో ఇద్దరు భారతీయులను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. 5 వేల తాబేళ్ళతో పాటు 14 కిలోల మాదకద్రవ్యాన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మలేసియా కస్టమ్స్ శాఖ అధికారులు వారి నుంచి 5,255 శిశు తాబేళ్ళను జప్తు చేశారు. కౌలాలంపూర్‌లోని సీపెంగ్‌లోని కస్టమ్స్ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ దాతుక్ జుల్కుర్‌మేయిన్ మహ్మద్ యూసుఫ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇద్దరు భారతీయుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు చైనాలోని గుంగ్జౌ నుంచి వచ్చారని ఆయన తెలిపారు. తాబేళ్ళను బాస్కెట్లలో పెట్టి, సూట్‌కేసులో అమర్చి తీసుకుని వచ్చారని, సెక్యురిటీ చెకింగ్‌లో ఇది బయటపడినట్లు ఆయన వివరించారు. అయితే ఈ ప్రయాణంలో సూట్ కేసుల్లో ఉన్న తాబేళ్ళకు గాలి లేక కొన్ని మరణించాయని, కొన్ని మాత్రమే బతికి ఉన్నాయని ఆయన తెలిపారు. వీటి విలువ యుఎస్‌డి ప్రకారం 12,700 అని చెప్పారు. లైసెన్సు లేకుండా తాబేళ్ళను రవాణా చేసినందుకు కస్టమ్స్ చట్టం- 1967 ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. వీటిని స్థానిక వన్య ప్రాణి, జాతీయ జూ పార్కులకు అందజేస్తామని ఆయన తెలిపారు.
ఇలాఉండగా 14.34 కిలోల మెథమ్‌పెండామైన్ మాదక ద్రవ్యా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు యూఎస్‌డి ప్రకారం 174,000 ఉంటుందని జుల్కుర్‌మేయిన్ తెలిపారు. భారత్‌లోని బెంగళూర్ నుంచి ఇద్దరు వ్యక్తులు మూడు బాక్సుల్లో విలువైన మాదక ద్రవ్యాలను తెచ్చారని ఆయన వివరించారు. సెక్యురిటీ చెకింగ్ వద్ద అనుమానం రావడంతో ఆ బాక్సులను తెరిచి చూడగా, ఇవి బయటపడ్డాయని తెలిపారు. వారిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
చిత్రం... సెపాంగ్ (మలేషియా)లో స్వాధీనం చేసుకున్న తాబేళ్లను ప్రదర్శిస్తున్న కస్టమ్స్ అధికారులు.