అంతర్జాతీయం

క్రైస్తవుల ఆస్తులను ముస్లింలు కొనొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, జూన్ 26: లెబనాన్‌లోని హదత్ పట్టణంలో క్రైస్తవుల ఆస్తిని ముస్లింలు కొనుగోలు చేయడానికి కాని, అద్దెకు తీసుకోవడానికి కాని వీలులేదు. అవును, లెబనాన్ రాజధాని బీరుట్‌కు ఆగ్నేయంగా ఉన్న హదత్ పట్టణంలో మున్సిపల్ అధికారులు అధికారికంగానే ఈ నిషేధం విధించారు. గత కొనే్నళ్లుగా ఈ నిషేధం అమలులో ఉంది. ఈ పట్టణంలోని క్రైస్తవుల ఆస్తులను కేవలం క్రైస్తవులే కొనుగోలు చేయాలి. లేదా అద్దెకు తీసుకోవాలి. లెబనాన్‌లో తెగలవారీగా జరిగిన విభజనకు హదత్ పట్టణం ఒక ఉదాహరణ మాత్రమే. సెంట్రల్, తూర్పు, దక్షిణ లెబనాన్‌లోని క్రైస్తవులు నివసించే కాలనీలలోనూ స్థానిక అధికారులు మరింత జాగ్రత్తగా ఇలాంటి నిషేధాలు విధించారు. ఈ విభజనే 15ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ అంతర్యుద్ధం కారణంగా లక్ష మందికి పైగా మృతి చెందారు. ముస్లింలలో జననాల రేటు ఎక్కువగా ఉండటం వల్ల వారి జనాభా వేగంగా పెరిగిపోతోందని, ఫలితంగా తాము మైనారిటీలో పడిపోతున్నామనే భయం క్రైస్తవుల్లో పెరుగుతోంది. ఒకప్పుడు క్రైస్తవుల ప్రాబల్యం కలిగిన కాలనీలు, పట్టణాలలో ఇప్పుడు ముస్లింల ప్రాబల్యం పెరిగింది. ముఖ్యంగా అంతర్యుద్ధం ముగిసిన 1990 నుంచి నిషేధం విధించిన 2010 వరకు గల మధ్య కాలంలో లెబనాన్‌లో ముస్లింల జనాభా వేగంగా పెరిగిపోయింది.