అంతర్జాతీయం

వెల్లివిరిసిన సుహృద్బావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 27: భారత్, జపాన్‌ల మధ్య మైత్రి, సహకార బంధం మరింత శక్తిని సంతరించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో గురువారం జరిపిన విస్తృతస్థాయి చర్చల్లో ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలెన్నో ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులతో పాటు ఆర్థిక నేరగాళ్ల అప్పగింత, విపత్తుల నిర్వహణవరకు అనేక అంశాలతో పరస్పర సహకారాన్ని ఎలా ఇనుమడింపజేసుకోవాలన్న దానిపై ఇరువురు నేతలు చర్చించారు. జపాన్ చక్రవర్తిగా నారోహితో పట్ట్భాషేకానికి భారత రాష్టప్రతి కోవింద్ హాజరవుతారని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. అక్టోబర్‌లో ఈ కార్యక్రమం జరగబోతోంది. జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన తనకు, తన ప్రతినిధి బృందానికి ఘనస్వాగతం పలికిన జపాన్ ప్రధానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జి-20 సారధిగా జపాన్ నిర్వహించిన పాత్రను ప్రశంసించారు. అనంతరం వీరిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వివరించారు. మోదీ-అబేల మధ్య ఏళ్ల తరబడి ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఆ నేపథ్యంలో ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ముఖ్యంగా ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరి దృష్టి కేంద్రీకృతమైందన్నారు. శుక్రవారం నుంచి మొదలుకానున్న జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే అంశంతో పాటు నేరస్థుల అప్పగింత కీలక అంశాలపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఎంతో ఉందని జపాన్ ప్రధాని ఉద్ఘాటించారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్య అంశాలను కూడా తేల్చాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా వాతావరణ మార్పులకు సంబంధించి ఓ స్పష్టమైన సందేశాన్ని ప్రపంచ పారిశ్రామిక దేశాల కూటమి అందించాల్సిన అవసరం ఉందన్నారు.