అంతర్జాతీయం

అధిక సుంకాలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/ ఒసాకా, జూన్ 27: అమెరికా ఉత్పత్తులపై భారత్ విధించిన భారీ దిగుమతి సుంకాలు తమకు ఆమోదయోగ్యం కాదని, వాటిని ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం డిమాండ్ చేశారు. జపాన్‌లోని ఒసాకాలో జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విడిగా భేటీ కానున్న తరుణంలో ఆయన ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలలో ప్రపంచ వాణిజ్య వివాదాలు ప్రధానంగా చర్చకు వస్తాయని భావిస్తున్నారు. ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్న ట్రంప్ భారత్ అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ఘోరంగా పెంచేసిందని విమర్శిస్తున్నారు. ఆయన భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా అభివర్ణించారు. ‘ భారత్ కొనే్నళ్ల నుంచి అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా విధిస్తూ వస్తోంది. ఇటీవలి కాలంలో వాటిని మరింత పెంచింది.
ఈ వాస్తవాలపై నేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతాను. ఇది ఆమోదయోగ్యం కాదు. దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవాలి’ అని ట్రంప్ గురువారం ఉదయం ఒసాకాకు వెళ్తూ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ఒసాకాలో శుక్రవారం మొదలవుతుంది. జీ-20 దేశాల సమ్మిట్ సందర్భంగా ట్రంప్ శుక్రవారం విడిగా నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తరువాత ట్రంప్ మోదీతో భేటీ అవుతుండటం ఇదే మొదటిసారి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో భారత్‌లో పర్యటించిన మరుసటి రోజు ట్రంప్ భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. పోంపియో తన భారత పర్యటనలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లను కలిశారు.
వాణిజ్య వివాదాలు సహా అనేక అంశాలపై పోంపియో వారితో చర్చించారు. భారత్, అమెరికా మధ్య పలు వాణిజ్య, ఆర్థిక అంశాలపై వివాదాలు తలెత్తి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత దెబ్బతిన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘వాణిజ్యానికి సంబంధించిన కొన్ని అపరిష్కృత అంశాలపై నేను నిర్మాణాత్మక, ఆచరణీయ దృక్పథాన్ని అనుసరిస్తాను. మా ఉద్దేశాలకు అసలయిన పరీక్ష దీనితో వ్యవహరించే మా సామర్థ్యమే’ అని జైశంకర్ పేర్కొన్నారు.