అంతర్జాతీయం

ద్వైపాక్షిక బంధానికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒసాకా, జూన్ 28: జి-20 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం కెనడా విదేశాంగ శాఖ మంత్రి క్రిస్టియాఫ్రీలాండ్, మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి మర్సిలోఎబ్రార్డ్‌లతో చర్చలు జరిపారు. ఈ రెండు దేశాలతో భారత్ మైత్రీ బంధాన్ని పెంపొందించుకునే అవకాశాలపై వీరితో ఆయ న మంతనాలు సాగించారు. ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం గురించి మాట్లాడడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఈ బంధాన్ని పరస్పర ప్రయోజనాలను సమస్యలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు జై శంకర్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు సహా అనేక అంశాలపై భారత్-కెనడాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని, ఈ బంధాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలన్నది తన ఆలోచన అని చెప్పారు. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన సంబంధాలు ఎంతో మెరుగు అయ్యాయని అలాగే ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయని ఆయన వెల్లడించారు. మెక్సికో విదేశాంగ మంత్రి ఎబ్రార్డ్‌తో కూడా ఫలవంతమైన మంతనాలు సాగించినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. త్వరలోనే మెక్సికో రాయబారి భారత్‌లో జరపనున్న పర్యటన ఇరుదేశాల సంబంధాలను మరింత మెరుగుపరచగలదన్న ఆశాభాన్ని జై శంకర్ వ్యక్తం చేశారు. 21వ శతాబ్ధ అవసరాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని పెంపొదించుకోవాలన్న ఆకాంక్షను ఇరు దేశాల విదేశాంగ మంత్రులు వ్యక్తం చేశారు. వీరి మధ్య చర్చలు రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాల సాధన అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.