అంతర్జాతీయం

భారత్‌పై దాడికి యత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత్‌పై దాడికి ఐఎస్‌ఐఎస్, కెనడాకు చెందిన సిక్కు మిలిటెంట్ సంస్థ చేతులు కలిపినట్టు తెలిసింది. రెండు సంస్థలూ దేశరాజధాని ఢిల్లీపై పెద్దఎత్తున దాడి చేయాలని వ్యూహరచన చేసినట్టు వెల్లడైంది. సిక్కు మిలిటెంట్ సంస్థ కెనడాలో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్, సిక్కు మిలిటెంట్ సంస్థ సంయుక్తంగా దాడికి దిగుతాయన్న విషయాన్ని ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఓ మహిళా సిక్కు మిలిటెంట్‌తో ఐఎస్ జరిపిన టెలిఫోన్ సంభాషణ ద్వారా ఇది వెల్లడైంది. రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసుకుని దాడికి దిగాలన్నది వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ సారాంశమని ఇంటిలిజెన్స్ విభాగం స్పష్టం చేసింది.