అంతర్జాతీయం

లిక్కర్ బాటిళ్లపై ‘గాంధీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, జూలై 3: జెరూసలెంలోని ఒక లిక్కర్ కంపెనీ బాటిళ్లపై పూజ్య బాపూ జీ మహాత్మా గాంధీ బొమ్మను ముద్రించడం వివాదాస్పదం కావడంతో ఎట్టకేలకు యాజమాన్యం దిగివచ్చింది. మద్యం బాటిళ్లపై గాంధీ బొమ్మ ముద్రించడం తప్పేనని ఒప్పుకుని ఇందుకు భారత్‌కు క్షమాపణలు చెప్పింది. మద్యం బాటిళ్లపై గాంధీ బొమ్మ ముద్రించడం వివాదాస్పదం కావడం, భారత రాజ్యసభలో సభ్యులు మంగళవారంనాడు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సదరు మద్యం కంపెనీ దిగొచ్చింది. బుధవారం ఇజ్రాయిల్ దేశం 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు ఇటు భారత ప్రజలకు, అటు ప్రభుత్వానికి క్షమాపణలు కోరింది. మంగళవారంనాడు రాజ్యసభలో ఇజ్రాయిల్ కంపెనీ తమ మద్యం బాటిళ్లపై గాంధీ బొమ్మను ముద్రించడాన్ని నిరసించడంతో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఈ అంశాన్ని పరిశీలించి తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు సూచించారు. ‘ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు మా మల్కా బీర్ తరఫున భారత ప్రజలకు, ప్రభుత్వానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఆ కంపెనీ బ్రాండ్ మేనేజర్ గిలాడ్ డ్రోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘మహాత్మా గాంధీ విలువలను తామెంతో గౌరవిస్తాం. మా మద్యం బాటిళ్లపై గాంధీ ముఖచిత్రాన్ని ముద్రించినందుకు మా చర్యకు చింతిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గాంధీ బొమ్మతో ముద్రించిన మద్యం బాటిళ్ల ఉత్పత్తి, సరఫరా జరుగకుండా చర్యలు తీసుకుంటామని భారత రాయబారి కార్యాలయానికి రాసిన ఒక లేఖ ద్వారా ఆయన స్పష్టం చేశారు.