అంతర్జాతీయం

షేక్ హసీనాపై దాడి కేసులో 9 మందికి మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాపై దాడి చేసిన సంఘటనలో స్థానిక కోర్టు 9 మందికి మరణ శిక్ష విధించింది. అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న షేక్ హసీనాపై 25 ఏళ్ల క్రితం జరిగిన దాడి కేసులో బుధవారం తీర్పు వెలువడింది. 1994 సెప్టెంబర్ 23న ఆమె ప్రయాణిస్తున్న రైలు బోగిపై కొంతమంది దాడి చేశారు. ఈ సంఘటనలో ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అప్పటి ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. పోలీసులు మొత్తం 135 మందిని పోలీసులు అనుమానితులుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 52 మందిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
కాగా, కోర్టు వీరిలో 9 మందికి మరణశిక్ష విధించింది. మరో 25 మందికి యావజీవ కారాగార శిక్షను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 13 మందికి పదేళ్లు చొప్పున జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది.