అంతర్జాతీయం

ఏ క్షణమైనా హఫీజ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 4: ముంబయి దాడులకు సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌పై ఉచ్చుబిగుసుకుంటోంది. హఫీజ్‌తోపాటు 12 మంది అతడి అనుచరులను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు బలవంతపువసూళ్లు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డ సరుూ ద్, అతడి అనుచరులపై పాకిస్తాన్ అధికారులు కేసు నమోదు చేసిన మర్నాడే పంజాబ్ పోలీసులు ఈ ప్రకటన చేయడం గమనార్హం. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్(సీటీడీ) బుధవారం జమాత్ ఉద్ దవాతోపాటు 12 సంస్థలపై 23 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు వసూలు చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి.‘మొత్తం 13 మంది ఉగ్రనేతలపై సీటీడీ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. త్వరలోనే వారందర్నీ అరెస్టు చేస్తాం’అని పంజాబ్ పోలీసు అధికార ప్రతినిధి నియాద్ హైదర్ నఖ్వీ గురువారం వెల్లడించారు. సీటీడీ ఈపాటికే అరెస్టు చేసి ఉండాల్సిందికదా?అని ప్రశ్నించగా ‘13 మందిపై అనుమానంతో కేసులు నమోదయ్యాయి. ఇది మొదట జరగాల్సిన ప్రక్రియ. ఇక అరెస్టులే తరువాయి. హఫీజ్ సరుూద్, 12మంది అనుచరులను కచ్చితంగా అరెస్టు చేసి తీరతాం’అని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే నిషేధిత ఉగ్రవాద సంస్థల పేరుతో నిధులు వసూళ్లకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం, జైలుకు పంపడం జరిగింది. ఉగ్రవాద నిరోధక కోర్టులు విచారించాయి. ‘ఈ అనుమానితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తాం’అని నఖ్వీ పేర్కొన్నారు. జమాత్ ఉద్ దవా చీఫ్ సరుూద్ ప్రస్తుతం లాహోర్‌లోని జౌహార్ పట్టణంలోని నివాసంలో ఉంటున్నాడు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఇంటిపై దాడి చేసి హఫీజ్‌ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బహుషా ఈ వారంలోనే హఫీజ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందజేసే సంస్థలపై చర్యలకు సంబంధించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) కార్యాచరణను రూపొందించడంలో విఫలమైంది. గత ఏడాది జూన్ నాటికే ఇది పూర్తికావల్సి ఉంది. దీంతో అక్టోబర్‌కు గడువుపెంచారు. ఉగ్రవాద సంస్థలకు ఎక్కడ నుంచి, ఏఏ మార్గాల ద్వారా నిధులు సమకూరుతున్నదీ ఎఫ్‌ఏటీఎఫ్ జాబితా తయారు చేసినా, చట్టాల్లో ఉన్న లోపాల కారణంగా చర్యలు తీసుకోడానికి వీలుపడలేదు. కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టులు జమాత్ ఉద్ దవా, జైషే మహ్మద్‌కు చెందిన 12 మందికి ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించాయి. తాజాగా బుధవారం హఫీజ్ సరుూద్, 12మంది అనుచరులపై మనీలాండరింగ్‌కు సంబంధించి తిరుగులేని ఆధారాలు లభించాయి. దీంతో 23 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇవన్నీ లాహోర్‌లో నమోదు చేశారు.