అంతర్జాతీయం

ఆ జంటను అప్పగించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను అప్పగించాలన్న భారత్ చేసిన విజ్ఞప్తిపై స్పందించి యూకే హైకోర్టు అనుమతి మంజూరు చేసినా ఇపుడు ఇద్దరు వ్యక్తుల హత్య కేసుతో సంబంధం ఉన్న భారత సంతతికి చెందిన ఒక జంటను తిరిగి రప్పించాలని చేసిన అభ్యర్థనను అక్కడి కోర్టు తిరస్కరించింది. 63 ఏళ్ల కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయల మేరకు మనీ లాండరింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న నేపథ్యంలో అతనిని విచారించేందుకు భారత్ చేసిన అభ్యర్థన మేరకు లండన్ హైకోర్టు ఈనెల 2న అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదేరోజు బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన జంట ఆర్తీ అధిర్, ఆమె భర్త కావల్ రాయ్‌జాడా తమ 11 ఏళ్ల దత్తపుత్రుడు గోపాల్, అతని బావమరిదిని హతమార్చిన కేసును వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్‌నాట్ విచారించారు. ఈ సందర్భంగా ఆమె తన సుదీర్ఘమైన తీర్పును వెలువరించారు. అయితే, విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న కేసును విచారించిన ఈ న్యాయమూర్తే ఇపుడు భారత సంతతికి చెందిన జంట విషయంలో దోషులను అప్పగించే విషయంలో విరుద్ధమైన తీర్పును వెలువరించడం గమనార్హం. యూరోపియన్ మానవ హక్కుల ఒడంబడికలోని ఆర్టికల్ 3 కింద ఆర్తీ ధిర్, ఆమె భర్త కావల్ రాయ్‌జాడాను భారత్‌కు అప్పగించేందుకు ఆస్కారం లేదని మేజిస్ట్రేట్ తన రూలింగ్‌లో పేర్కొన్నారు. నిందితులు పాల్పడిన చర్య వల్ల తాము అనుభవించబోయే క్షోభ ఎలాంటిదో వారు కూడా చవిచూడాల్సి ఉంటుందని, ఇందుకు వారికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి క్షమాభిక్ష పెట్టడం ఎంతమాత్రం తగదని ఆమె పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన ఈ జంట పాల్పడిన నీతిబాహ్యమైన చర్య మరొకరు కూడా ఇదే తీరున వ్యవహరించేందుకు ప్రోత్సహించేలా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ జంట విషయంలో మరణశిక్ష విధించవద్దని, వారిని తమకు అప్పగించేందుకు గల కొన్ని హామీలను లండన్ కోర్టుకు భారత్ తెలియజేసింది. అయితే, ఈ జంట పాల్పడిన చర్య ఎంతమాత్రం సహేతుకం కాదని, వారిని ఇప్పట్లో భారత్‌కు అప్పగించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.